మల్కాజ్ గిరి లోక్ సభ స్థానం నుంచి పోటీచేస్తున్నానని ఆయన ఫేస్ బుక్ లో తెలిపారు. దేవుడి ఆశీర్వాదంతో వస్తున్న తనకు మద్దతు ఇవ్వాలని నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈరోజు ఫేస్ బుక్ లో రేవంత్ రెడ్డి స్పందిస్తూ..‘దేవుని ఆశీర్వాదంతో మీ ముందుకు వస్తున్నా..మల్కాజ్ గిరి బిడ్డా.. మద్దతు ఇవ్వు’ అని పోస్ట్ చేశారు.
తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తన ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. మల్కాజ్ గిరి నుంచి ఆయన ఎంపీగా పోటి చేస్తున్న విషయం తెలిసిందే. మల్కాజ్ గిరి నుంచి పోటి చేస్తున్నానని ఆయన తన ఫేస్ బుక్ లో తెలిపారు. దేవుడి ఆశీర్వాదంతో వస్తున్నా… తనకు మద్దతు ఇవ్వాలని నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేంద్రంలో కేసీీఆర్ ఊసే లేదన్నారు. సారు.. కారు… సర్కార్ కాదని సార్ కారు బేఖారని విమర్శించారు.
“:దేవుని ఆశీర్వాదంతో మీ ముందుకు వస్తున్నా… మల్కాజ్ గిరి బిడ్డా.. మద్దతు ఇవ్వు” అని ఆయన పోస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి అంతకు ముందు జూబ్లీహిల్స్ లోని వెంకటేశ్వర ఆలయంలో పూజలు చేశారు. అక్కడ ఆశీర్వాదం తీసుకొని ఆయన తన ప్రచారం ప్రారంభించారు. రేవంత్ రెడ్డి ఉత్సాహంగా తన ప్రచారం మొదలు పెట్టడంతో కార్యకర్తల్లో జోష్ వచ్చింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 8 మంది అభ్యర్ధులను ప్రకటించింది.
మరో రెండు రోజుల్లో మిగిలిన అభ్యర్ధులను ప్రకటించే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి ఖమ్మం లేదా మహబూబ్ నగర్ నుంచి బరిలోకి దిగుతారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా రేవంత్ మల్కాజ్ గిరి నుంచి బరిలోకి దిగుతున్నారు. అధిష్టానంతో చర్చించాకనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రేవంత్ కూడా మల్కాజ్ గిరి నుంచి బరిలోకి దిగేందుకే సంసిద్దత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. రేవంత్ తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడంతో అంతా జోష్ లో ఉన్నారు.