ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైస్ జగన్ మోహన్ రెడ్డి లోక్ సభ తొలి జాబితా అభ్యర్థుల్ని ప్రకటించారు. తొమ్మిదిమందితో కూడిన జాబితాను శనివారం విడుదల చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి మృతితో రాష్ట్రంలో గత రెండు రోజులుగా చోటు చేసుకున్న అనివార్య పరిణామాల వలన శనివారం సాయంత్రం చేయాల్సిన ప్రకటనను ఆదివారానికి వాయిదా వేశారు. కానీ అనూహ్య రీతిలో శనివారం రాత్రి లోక్ సభ తొలిజాబితా అభ్యర్థుల్ని ప్రకటించారు.
పార్టీ అధినేత జగన్, కోర్ కమిటీ సమగ్రంగా చర్చించి ఇప్పటికే 175 అసెంబ్లీ స్థానాలకు, 25 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసింది. కాగా విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి సూచన మేరకు ఈరోజు తొమ్మిది మంది పార్లమెంటు అభ్యర్థుల్ని ప్రకటిస్తున్నట్టు ఆ పార్టీ అధికారికంగా పేర్కొంది. తొలిజాబితాలో చోటు దక్కించుకున్న నాయకుల లిస్ట్ కింద ఉంది చూడండి.
అరకు-గొడ్డేటి మాధవి
అమలాపురం-చింతా అనురాధ
రాజంపేట-పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి
కడప-వైఎస్ అవినాష్ రెడ్డి
హిందూపురం-గోరంట్ల మాధవ్
అనంతపురం-తలారి రంగయ్య
బాపట్ల-నందిగం సురేష్
చిత్తూర్-రెడ్డప్ప
కర్నూల్-సంజీవ్ కుమార్