కాంగ్రెస్ ఉక్కిరి బిక్కిరి – ఈనాడు
చివరకు మిగిలేది ! – సాక్షి
కాంగ్రెస్ ఖాళీ – నమస్తే తెలంగాణ
కాంగ్రెస్ ఫినిష్ – ఆంధ్రజ్యోతి
ఇక విలీనమే ! – ఆంధ్రప్రభ
కాంగ్రెస్కు మరో షాక్ – ఆంధ్రభూమి
చేజారుడలో బేజార్ – మన తెలంగాణ
దూకేస్తున్నారు, జనం ఏమైనా కానీ … – నవ తెలంగాణ
కాంగ్రెస్కు మరో దెబ్బ – వార్త
కారెక్కుతున్న మరో ఇద్దరు – సూర్య
కాంగ్రెస్కు మరో షాక్ – వెలుగు
ఇవి ఇవాళ తెలుగు దినపత్రికల్లో వచ్చిన హెడ్డింగ్లు. ఇది మన ప్రజాస్వామ్యం. ఒక గుర్తు మీద గెలిచి , అధికార పార్టీలో జంప్ చేసిన కాంగ్రెస్ పార్టీ గురించి దినపత్రికలు రాసిన కథనాలకు హెడ్డింగ్స్ ఇవి. ప్రజాస్వామ్యానికి నాలుగో స్థంభం అంటారు మీడియా, కానీ ఇప్పుడది అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నాయని అనడంలో ఎటువంటి తప్పు లేదు.
స్వేచ్ఛగా వార్తలు రాసి హెడ్డింగ్లు కూడా పెట్టుకోలేని స్థితిలో ఉన్నాయి. చట్టపరంగా పార్టీలు మారి పదువులు అనుభవించండం తప్పు అని ఏ ఒక్క పేపర్ కూడా రాయలేదు కేవలం ఒక్క నవ తెలంగాణ మాత్రం దూకేస్తున్నారు-జనం ఏమైనా కానీ… అని రాసింది.
ఈ వార్తలు రాసిన వారే రోజు ప్రజ్యాస్వామ్యం, న్యాయం, అన్యాయం అంటూ తిరుగుతారు.
కనీసం పార్టీలు మారుతున్న ఎమ్మెల్యేలు ప్రజల్ని మోసం చేస్తున్నారని ఎందుకు రాయడం లేదు. మీడియానే ఇలా ఉంటే…. ఇక వారికి అడ్డుఅదుపు ఏంటీ ? కనీసం ఒక్కసారైన ఆలోచన చేయరా…. గత కొన్ని రోజులుగా ఇవే తప్పా…. వాళ్లు ప్రజల్ని మోసం చేస్తున్నారు వారిది తప్పు అని ఎందుకు నిలదీయం లేదు. ఈ నాలుగో స్థంభానికి ఏమైంది.
ఆ స్థంభం తుప్పు పట్టిపోయిందా…. ఏందీ ?
శ్రీనివాస్. కె