దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ సోదరుడు, వైసీపీ అధినేత జగన్ బాబాయ్, ప్రముఖ రాజకీయ నాయకుడు వైఎస్ వివేకానందరెడ్డి ఈరోజు తెల్లవారుఝామున మరణించారు. పులివెందులలోని ఆయన నివాసంలో గుండెపోటుతో మరణించారు. వాంతులు కావడంతో స్నానాల గదికి వెళ్లిన ఆయన అక్కడే గుండెపోటుతో కుప్పకూలిపోయారు. ఆయన మరణంతో కుటుంబంలోను, అభిమానుల్లోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి.
వైఎస్ వివేకానందరెడ్డిని కడసారి చూసేందుకు పులివెందులకు జనం భారీగా తరలి వస్తున్నారు. ఆప్తుల మరణ వార్త వినగానే ఎవరైనా హుటాహుటిన అక్కడికి వెళ్ళిపోతారు. కానీ జగన్ సొంత బాబాయ్ చనిపోయినా వెంటనే హైద్రాబాద్ నుండి పులివెందుల వెళ్లలేకపోయారు. బాబాయిని చూసేందుకు మాత్రం జగన్ కి అడ్డంకులు ఏర్పడ్డాయి.
ఈ వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. సర్వత్రా దీని గురించే చర్చించుకుంటున్నారు. ఈరోజు శుక్రవారం కావడంతో జగన్ నాంపల్లి హైకోర్టులో హాజరు కావాల్సి ఉంది. నాంపల్లి కోర్టుకి వెళ్లి పర్మిషన్ తీసుకుని బాబాయిని చివరిసారి చూడటానికి జగన్ వెళ్లనున్నట్టు ఆయన సన్నిహితులు తెలిపారు.
తండ్రి తర్వాత తండ్రి స్థానంలో ఉన్న బాబాయ్ మరణవార్త తెలియగానే జగన్ దిగ్భ్రాంతికి గురయ్యారని తెలిపారు. బాబాయిని వెంటనే చూడటానికి కూడా అవకాశం లేదని జగన్ కృంగిపోతున్నట్లు సమాచారం. ఇలాంటి కష్టమైన పరిస్థితుల్లో జగన్ ను చూసి ఆయన సన్నిహితులు, కుటుంబసభ్యులు మరింత ఆవేదనకు లోనవుతున్నారు.
వైఎస్ వివేకానందరెడ్డి గురించి చాలామందికి తెలియని విషయాలు