తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. అసెంబ్లీ ఆవరణలో బుధవారం ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా తన రాజకీయ భవిష్యత్తుపైనా, కాంగ్రెస్ పార్టీ గురించి కూడా అనేక విషయాలను వెల్లడించారు. ఆయనేమన్నారో చదవండి.
వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను.
ఈ నియోజకవర్గం, ఆ నియోజవర్గం అనేమీ లేదు. ఎక్కడినుంచైనా పోటీకి దిగుతా.
పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు లీడర్ గా నాకు తప్పదు.
గెలిచినా ఓడినా సరే కార్యకర్తల్లో ధైర్యం నింపాల్సిన అవసరం ముఖ్యనేతల మీద ఉంటది.
ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు వార్ జోన్ లో ఉన్నాయి.
పోరాడే టైమ్ లో పోరాడాల్సిందే… పార్టీ లీడర్ గా నా బాధ్యత అనుకుంటున్నాను. పోరాటానికి నేను రెడీ.
2014 లో థంపింగ్ మెజారిటీతో గెలిచిన బీజేపీ … మూడునెలల్లో వచ్చిన ఢిల్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయింది.?
కేసీఆర్ గచ్చిబౌలీ దివాకర్ లాంటోడు. కాంగ్రెస్ టెండూల్కర్ లాంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీది నిజమైన చరిత్ర అయితే కేసిఆర్ ది ఉత్తుత్తి ఆరాటమే.
సాంప్రదాయాల పేరుతో టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ మద్దతు తీసుకుంటది… మరి కాంగ్రెస్ నంబర్ ఉన్నా కేసీఆర్ ఎలా అభ్యర్థిని పెట్టారు ?
ఈ ట్రెండింగ్ ఆర్టికల్ చదవండి
https://trendingtelugunews.com/who-is-undermining-telangana-congress-from-within/