కాంగ్రెస్ మహిళా నేత సబితా ఇంద్రారెడ్డితో టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. పార్టీ మారవద్దని పార్టీలోనే కొనసాగాలని ఆయన సబితా ఇంద్రారెడ్డిని కోరారు. పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సబితా ఇంద్రారెడ్డిని రేవంత్ మాట్లాడించారు. దీంతో కాస్త వెనక్కు తగ్గిన సబితా పార్టీలోనే కొనసాగేందుకు నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. మంగళవారం సాయంత్రం రేవంత్, సబితా, కార్తీక్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. బుధవారం ఉదయం వారు రాహుల్ గాంధీతో సమావేశం కానున్నారు.
అంతకు ముందు సబితతో ఉత్తమ్ కుమార్, భట్టి విక్రమార్క, జానారెడ్డి భేటి అయ్యారు. వారందరిని కూడా క్లాస్ పీకి సబితా ఇంద్రారెడ్డి పంపినట్టు తెలుస్తోంది. కేటిఆర్ తో మీరెందుకు మాట్లాడారని, బ్లాక్ లిస్టులో పెట్టారా అని ఎందుకు ప్రశ్నించారని సబితా ఉత్తమ్ ను నిలదీసినట్టు తెలుస్తోంది. అంతా సబితా ఇంద్రారెడ్డి పార్టీ మారుతారు అనుకున్న సమయంలో రేవంత్ రెడ్డి మధ్యవర్తిత్వం నడిపి ఆమె పార్టీ మారకుండా ఒప్పించారని తెలుస్తోంది.
సఃబితా ఇంద్రారెడ్డి రెండు రోజుల క్రితం అసదుద్దీన్ మధ్యవర్తిత్వంతో కేటిఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా సబిత కుమారుడు కార్తీక్ రెడ్డికి ఎంపీ టికెట్, ,సబితకు మంత్రి పదవి ఆఫరిచ్చారని కూడా ప్రచారం జరిగింది. ఇంతలోనే కాంగ్రెస్ నేతలు అలర్ట్ అయ్యారు. చర్చలు జరిపినా అవి సఫలం కాలేదు. రేవంత్ రెడ్డి సీన్ లోకి ఎంటరయ్యి సోమవారం రాత్రి వారితో చర్చలు జరిపారు. రాహుల్ గాంధీతో ఫోన్లో మాట్లాడించి వారిని పార్టీ మారకుండా ఒప్పించారు.
రేవంత్ ఆధ్వర్యంలోనే మంగళవారం సాయంత్రం సబితా, కార్తీక్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ రోజు రాత్రి లేదా బుధవారం ఉదయం రాహుల్ గాంధీతో బేటి అయ్యే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి సబితను పార్టీ మారకుండా చూడడంతో టిఆర్ఎస్ కు ఝలక్ తగిలిందని నేతలు చర్చించుకుంటున్నారు.