ప్రధాన మంత్రి నరేంద్రమోదీ విలువయిన అయిదేళ్ల కాలాన్ని వృధా చేశారని, ఎంతో చేసి ఉండాల్సి ఉండిందని ఆయన మాజీ ఆర్థిక మంత్రి,సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పి చిదంబరం అన్నారు. ఆయన అతి పెద్ద వైపల్యం ఉద్యోగాల కల్పన లో అన్నారు.
అయిదేళ్ల కాలాన్ని వృధా చేయడమే కాదు, దేశ ఆర్థిక రంగాన్ని గాడితప్పించారని అన్నారు. ఆర్థిక వ్యవస్థ గాడి తప్పడానికి రెండు ప్రధాన కారణాలు చిదంబరం పేర్కొన్నారు. ఒకటి డిమానెటైజేషన్ (నోట్లరద్దు), రెండోది తప్పుల తడికె జిఎస్ టి అని ఆయన ఉదహరించారు.ఈ లోపాలను పూరించుకునేందుకు మోదీ ప్రభుత్వం నానా అగచాట్లు పడుతున్నారు.దీనితో ఈ చట్టం మరింత గందరగోళంగా తయారయింది. ఈ విషయాలను ఆయన బెంగుళూరు నుంచి వెలువడే దక్కన్ హెరాల్డ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. పి చిదంబరం ఇంకా ఏమన్నారో చూడండి…