ప్రతి పేదోడికి కనీస ఆదాయ పథకం తేబోతున్నాం. తప్పని సరి ఆదాయం అందుతుంది. దేశంలో ఉన్న ప్రతి పేదోడి ఆదాయం తగ్గకుండా ఉంటుంది. కుల మత, ప్రాంత భేదాల తేడాలేకుండా పథకాన్ని అమలుచేస్తాం. ప్రతి ఒక్క పేదోడి అక్కౌంట్ లో డబ్బులేస్తాం. ఏ ఒక్క పేదోడినీ వదలకుండా వెతికి అక్కౌంట్ లో డబ్బులిస్తాం. మోడీ నీరవ్ మోడీ జేబులో డబ్బులేస్తే… మేము పేదోడి బ్యాంక్ అక్కౌంట్ లో డబ్బులేస్తాం.
ఐదేళ్లు పీఎం గా ఉన్న మోడీ ..దేశాన్ని రెండుగా చీల్చాలని చూసారు. బ్యాంక్ ల్లో వేలకోట్లు మాఫీ చేసి ధనవంతుల కోసం దేశాన్ని లూటీ చేసారు మోడీ. ఆయన చెప్పిన రెండు కోట్ల ఉద్యోగాలు ఎటు పోయాయి ? దేశానికి నష్టం చేసిన మోడీకి… కేసీఆర్ మద్దతు పలుకుతారు.
రాఫెల్ తో ..30వేల కోట్లు దోచారు. విమానాల తయారీ అనుభవం లేని అంబానీకి మోడీ రాఫెల్ డీల్ ఇచ్చారు. రాఫెల్ స్కాం పై కెసిఆర్ ఎందుకు ప్రశ్నించరు. కెసిఆర్ అవినీతి చిట్టా మోడీ చేతిలో ఉంది. అందుకే భయపడుతున్నారు. మోడీ పీఎం గా ఉండాలనుకుంటున్నారు కేసీఆర్. వారిద్దరూ దోస్తులు. మేము ఎట్టి పరిస్థితుల్లో దేశాన్ని రెండుగా కానివ్వం.
ప్రతి నిరుపేద ..ధనికుడు అయ్యేలా చేయడమే లక్ష్యం. కార్పొరేట్ కోసం మోడీ పనిచేస్తే ..మేము గరీబోళ్ల కోసం పనిచేస్తాం. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే… మహిళా రిజర్వేషన్ బిల్లు తెస్తాం ..వారికి హక్కులు కల్పిస్తాం. చత్తిస్ ఘడ్ లో మేము చెప్పిన రైతులు, ఆదివాసులకు ఇచ్చిన హామీని అమలు చేసి చూపించాం.
జీఎస్టీ ని ఒకే ట్యాక్స్ గా చేస్తాం. చిన్న వ్యారులు, యువ పారిశ్రామక వేత్తలకు రుణాలిస్తాం. ప్రజలెవరూ భయపడవద్దు. కాంగ్రెస్ చెయ్యి… మీకు అండగా ఉంటుంది. యుపిలో బిజెపి ఎమ్మెల్యే మహిళను అత్యాచారం చేసిన మోడీ ఏమీ అనరు. ఎందుకు ఆ ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోలేదు ? దేశ భక్తిడినని చెప్పే మోడీ ..రాఫెల్ లో దోపిడీ చేస్తారా?
డోక్లామ్ లో చైనా ఆర్మీ వస్తే ..మోడీ గుజరాత్ లో చైనా ప్రధానితో చాయ్ తాగుతారు. పుల్వామా లో తీవ్రవాదులు అటాక్ చేస్తే ..మోడీ సినిమా షూటింగ్ లో నటిస్తారు. ఇదేనా మోడీ దేశ భక్తి ? తెల్లోళ్ళను తరిమిన చరిత్ర కాంగ్రెస్ ది. మేమెవరిముందు తల వంచం ..మాది దేశ భక్తి. అణిచివేతకు మోడీ పాల్పడుతుంటే ..కేసీఆర్ ఆయనకు మద్దతు పలుకుతున్నారు.