ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది.
కబీర్ నగర్ జిల్లా నియోజకవర్గం సమీక్ష సమావేశంలో సంత్ కబీర్ నగర్ ఎంపి శరద్ త్రిపాఠీ, మేధావల్ ఎమ్మెల్యే రాకేష్ సింగ్ కు మధ్య వాగ్వాదం మొదలయి చూస్తుండగానే తన్నుకునే దాకా పోయింది.
సమావేశానికి మంత్రి అశుతోష్ టాండాన్ అధ్యక్షత వహించారు.
కొత్తగా వేసిన ఒక రోడ్డు క్రెడిట్ ఎవకిరి దక్కాలనే దానిమీద ఈ వాగ్వాదం మొదలయింది. కొద్ది సేపు అరుచుకున్న తర్వాత, ఎంపి త్రిపాఠీ తనసీటులో నుంచి లేచి బూట్ తీసి ఎమ్మెల్యేను ఉతకడం మొదలుపెట్టారు.
చాలా మంది వెంటనే చేసిన పని దీనిని మొబైల్ లో వీడియో తీయడం.అందుకే ఇది ప్రపంచానికి వెంటనే తెలిసిపోయింది.
ఎంపి కొడితే ఎమ్మెల్యే ఊరుకుంటాడా, ఆయన రెండేట్లు వేశాడు.కొద్దిసేపు పెనుగులాట పిడిగుద్దులు కొనసాగాయి.
శిలా ఫలకంపై పేర్ల వరుస క్రమం గురించి బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ సింగ్, ఎంపీ శరద్ త్రిపాఠి మధ్య వివాదం మొదలయింది.
సమావేశంలో ఉన్న వాళ్లంతా హతాశులయ్యారు. కొందరు ముందుకు వచ్చి వారించినా వినకుండా తన్నుకున్నారు.
పార్టీలో క్రమశిక్షణా రాహిత్యం సహించనని, దీని మీద చర్య తీసుకుంటానని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు.