కోపీ లువాక్ కాఫీ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఈ కాఫీ ధర వేలల్లో ఉంటుంది. ఖరీదు ఎక్కువైనా దీని డిమాండ్ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. కోపీ లువాక్ కాఫీ ఒక కప్పు కాస్ట్ అక్షరాలా 5 వేల రూపాయలు. చాలా తక్కువ మొత్తంలో కాఫీ పొడి తయారవడమే. దీని ఖరీదు ఎక్కువగా ఉండటానికి కారణం.
అంతేకాదు మరో విశేషమేమిటంటే ఈ కాఫీ సివెట్ క్యాట్ విసర్జనతో తయారు చేస్తారు. ఇండోనేషియా ప్రాంతంలోని సివెట్ క్యాట్స్ స్థానికంగా దొరికే కాఫీ గింజల్ని తిని విసర్జిస్తుంది. తర్వాత వాటిని సేకరించి, శుభ్రపరిచి కాఫీ పొడి తయారు చేస్తారు.
ప్రపంచవ్యాప్తంగా ఈ కాఫీ పొడికి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. కానీ ఈ కాఫీ పొడి తయారు చేయడం కష్టతరంగా మారింది. దీనికి కారణం సివెట్ క్యాట్స్ చాలా చిన్న జంతువులు. అందుకే వీటిని ఫార్మ్స్ లో పెంచి కాఫీ పొడిని తయారు చేస్తున్నారు.
ఆనోటా ఈనోటా ఈ కాఫీ టేస్ట్ మన దేశానికి కూడా చేరింది. కర్ణాటకలో కూడా ఒక సంస్థ ఈ పిల్లుల్ని పెంచడం స్టార్ట్ చేసింది. కోపి లువాక్ కాఫీ పొడి మన దేశంలో కూడా తయారవుతోంది.