యువ తెలంగాణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాణి రుద్రమ దేవి మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ధిగా నామినేషన్ వేశారు. కరీంనగర్ కలెక్టర్ కార్యాలయంలో ఆమె నామినేషన్ వేశారు. ఆమె వెంట పలువురు నాయకులు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆమె గత అసెంబ్లీ ఎన్నికల్లోనే ఎమ్మెల్యేగా పోటి చేయాలనుకున్నా పరిస్థితుల దృష్ట్యా ఆమె పోటి చేయలేకపోయారు.
ఇదే స్థానం నుంచి మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి కాంగ్రెస్ మద్దతుదారునిగా బరిలోకి దిగుతున్నారు. ఉద్యోగుల సంఘం నేత మామిళ్ల చంద్రశేఖర్ గౌడ్ టిఆర్ఎస్ మద్దతుతో బరిలోకి దిగుతున్నారు. రాణి రుద్రమ దేవి బరిలోకి దిగడంతో అంతా చర్చనీయాంశమైంది. తెలంగాణ ఉద్యమంలో రాణి రుద్రమదేవి కీలక నేతగా వ్యవహరించారు. ఆమె యాంకర్ గా పని చేశారు.