తెలంగాణ కాంగ్రెస్ కు ఝలక్… ఇద్దరు ఎమ్మెల్యేలు అవుట్

తెలంగాణ కాంగ్రెస్ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు అవుటయ్యారు. ప్రస్తుతం ఈ వార్త తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు కాంగ్రెస్ కు రాజీనామా చేసి టిఆర్ఎస్ లో చేరేందుకు సిద్దమయ్యారు. ఆదివారం ఉదయం వారు అధికారికంగా టిఆర్ఎస్ లో చేరనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు ఎమ్మెల్యేల జంప్ కాంగ్రెస్ కు ఝలక్ ఇచ్చింది. గతం నుంచి కూడా టిఆర్ఎష్ వారు తమతో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని చెబుతూ వచ్చారు. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా జాగ్రత్త పడడంలో విఫలమయ్యారని తెలుస్తోంది.

ఆత్రం సక్కు

అయితే ఈ రోజే టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సీఎం కేసీఆర్ ను కలిశారు. త్వరలోనే ఆయన కూడా టిఆర్ఎస్ లో చేరడం ఖాయమని తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఎమ్మెల్యేలు పార్టీని మారడం కాంగ్రెస్ ను కలవరంలోకి నెట్టింది. దీంతో కాంగ్రెస్ బలం 17కి పడిపోయింది. ప్రస్తుతం కాంగ్రెస్ కు 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ లో చేరడంతో ఇక వారి సంఖ్య అసెంబ్లీలో 17 గా ఉండనుంది.

రేగ కాంతారావు

ప్రస్తుతం ఈ వార్త తెలంగాణ రాజకీయాల్లో కలవరాన్ని రేపింది. ఎమ్మెల్సీ ఎన్నికలు మరియు పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పెద్ద ఎదురుదెబ్బ తగలడంతో కాంగ్రెస్ లో కలవరం మొదలైంది. మరికొంత  మంది ఎమ్మెల్యేలు చేజారే అవకాశం ఉండడంతో నేతలు జాగ్రత్తలు చేపట్టినట్టు తెలుస్తోంది. తెలంగాణలో ఎమ్మెల్సీ సీటు గెలుస్తామనుకున్న కాంగ్రెస్ కు ఆదిలోనే దెబ్బ తగిలింది. దీంతో ఏం చేయాలో దిక్కుతోచక కాంగ్రెస్ శ్రేణులున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు చర్యలు తీసుకోకపోవడంతో స్వంత పార్టీలోనే విమర్శలు వస్తున్నాయి. ఆత్రం సక్కు మరియు రేగ కాంతారావులు టిపిసిసి కి రాసిని లేఖ కింద ఉంది చదవండి.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *