సినీ నటి కరాటే కళ్యాణి యాదవ సామాజిక వర్గం గురించి అనూహ్య వ్యాఖ్యలు చేసారు. సాధారణంగా ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తులు తమ కమ్యూనిటీ గురించి గొప్పగా చెప్పుకోవాలి అంటే భయపడతారు. ఎందుకంటే కొన్ని బలమైన సామాజిక వర్గాలు ఇండస్ట్రీని ఏలుతున్నాయి అనేది తరచూ వినిపించే వాదన. మిగిలిన కులాలవారు తమ వర్గం గురించి మాట్లాడితే ఎక్కడ ఆఫర్స్ దక్కవో అని భయమంటుంటారు.
అయితే ఇందుకు భిన్నంగా కరాటే కళ్యాణి ఒక ఇంటర్వ్యూలో తమ యాదవ కమ్యూనిటీ గురించి ఆమె పలు వ్యాఖ్యలు చేసారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఆమె మాట్లాడిన వీడియో తెగ వైరల్ అవుతోంది. యాదవులు నీతి, నిజాయితీలతో ఉంటారని, ముక్కుసూటిగా వ్యవహరిస్తారని తెలిపారు. కుట్రలు తెలియవన్నారు. ఇంకా ఆమె ఏం మాట్లాడారో తెలియాలంటే కింద ఉన్న వీడియో చూడండి.