ఉండవల్లి నివాసంలో క్రెడాయ్, బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, మల్లవల్లి ఇండస్ట్రీస్ అసోసియేషన్, నవ్యాంధ్ర ఇండస్ట్రియల్ అసోసియేషన్, స్వర్ణాంధ్ర ఇండస్ట్రీస్ అసోసియేషన్ ప్రతినిధులతో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆయన మాట్లాడుతూ 2014 రాష్ట్ర విభజన తరువాత అనేక సమస్యలు ఎదుర్కొన్నాం. సమస్యలను అధిగమించి అభివృద్ధి సాదించగలిగాం.
గతంలో ఎప్పుడూ లేని విధంగా గ్రామాలను అభివృద్ధి చేసుకున్నాం అని అన్నారు. వ్యవసాయ రంగంలో వృద్ధి సాధించాం. దేశంలో రెండంకెల వృద్ధి సాధించిన ఒకే ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని మంత్రి నారా లోకేష్ వివరించారు. పారిశ్రామికాభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకున్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 స్థానానికి ఎదిగాం. ఇంకా చెయ్యాల్సింది ఎంతో ఉంది అని మంత్రి నారా లోకేష్ అన్నారు.
అసోసియేషన్ల వారిగా సమస్యలు, సూచనలు తెలుసుకొని వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తా అని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. మరింత మంది మహిళలు పారిశ్రామికవేత్తలుగా రాణించేందుకు ప్రభుత్వం తరపున నిరంతర సహకారం అందిస్తాం అని అన్నారు.ప్రతి మూడు నెలలకోసారి మీ సమస్యలు తెలుసుకొని ఎప్పటికప్పుడు పరిష్కారం చెయ్యడానికి ఒక విధానం తీసుకోస్తాం అని మంత్రి నారా లోకేష్ అన్నారు.
అసోసియేషన్ల ప్రతినిధులు మాట్లాడుతూ…
ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామిక రంగం అభివృద్ధి కి అనేక పాలసీలు తీసుకొచ్చారు, అనేక రాయితీలు కల్పిస్తున్నారు. మిగిలి ఉన్న చిన్న సమస్యలు కూడా మీ దృష్టికి తీసుకొచ్చాం. ఈ సమస్యలు త్వరితగతిన పరిష్కారం అయితే రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, రియల్ ఎస్టేట్ రంగం మరింత వేగంగా అభివృద్ధి చెందుతాయి అని అసోసియేషన్ల ప్రతినిధులు అన్నారు.