కోట్లాది భారతీయుల ప్రార్ధన ఫలించింది. పాక్ నిర్బంధంలో ఉన్న ధీర జవాన్ రాక కోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్నవారి ఆకాంక్ష నెరవేరింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ స్వదేశంలో అడుగుపెట్టారు. అభినందన్ ను లాహోర్ నుండి రోడ్డుమార్గంలో తీసుకొచ్చిన పాక్ అధికారులు వాఘా సరిహద్దువద్ద భారత్ కు అప్పగించారు.
భారత వాయుసేన ఆయనకు ఘన స్వాగతం పలికింది. ఫార్మాలిటీస్ ప్రకారం అభినందన్ కు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయన మానసిక స్థితి ఎలా ఉంది? నిర్బంధంలో ఉన్న అభినందన్ నుండి పాక్ సమాచారం రాబట్టేందుకు ప్రయత్నించిందా? ఆయన్ను టార్చర్ చేసిందా? శరీరంలో బగ్ లు ఏర్పాటు చేసిందా అనే అంశాలను పరీక్షించనుంది ఎయిర్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ విభాగం.