ఇండియా-పాకిస్థాన్ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం చేసుకుంది. సరిహద్దుల్లో యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. పాక్ లో ఇండియా జరిపిన ఎయిర్ స్ట్రైక్స్ తో పాకిస్థాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.ఈ దాడులకు ప్రతిగా భారత్ కు సర్ ప్రైజ్ ఇస్తామంటూ పాకిస్థాన్ ఆర్మీ జనరల్ చీఫ్ బహిరంగ ప్రకటన చేశారు. ఇక భారత్ కూడా సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించింది. కీలక ప్రాంతాల్లో హై అలెర్ట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో టీఆరెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.
బుధవారం మీడియాతో మాట్లాడారు టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సందర్భంగా రేపటి నుండి జరగాల్సిన టిఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సమావేశాలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. దేశ సరిహద్దుల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సమావేశాలు వాయిదా వేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మళ్లీ ఎప్పటి నుండి సమావేశాలు నిర్వహించే విషయం పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తో సంప్రదించిన తర్వాత ప్రకటిస్తామని కేటీఆర్ చెప్పారు