మంగళవారం ఉదయం భారత్ జరిపిన ఎయిర్ స్ట్రైక్స్ తో పాకిస్థాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఎటువంటి నష్టం జరగలేదంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. బోర్డర్ లో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. మంగళవారం నుండి కాల్పులకు తెగబడింది. సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉన్న మన సైనికులు చాకచక్యంగా పాక్ దాడులను తిప్పికొట్టారు. అయితే ఈ కాల్పుల్లో జైష్ ఏ మహమ్మద్ సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయినట్టు తేల్చింది ఇండియన్ ఆర్మీ.
కాగా బుధవారం మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టుకుంది పాక్. భారత గగనతలంలోకి 3 జెట్ ఫైటర్స్ ని పంపింది. నౌషిరా, రాజౌరి సెక్టార్ లోకి ప్రవేశించిన పాక్ ఎఫ్-16 విమానాలు పలుచోట్ల బాంబులు విడిచాయి. అయితే ఈ దాడిలో ఎటువంటి నష్టం జరగలేదని స్పష్టం చేసింది భారత్ ఆర్మీ. కాగా భారత వైమానికదళం పాక్ జెట్ ఫైట్లపై కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ఒక పాక్ జెట్ ఫైటర్ కుప్పకూలిపోగా పాక్ పైలట్ పారాచూట్ సాయంతో తప్పించుకున్నాడు. భారత ఆర్మీ దెబ్బకు మరో రెండు జెట్ ఫైటర్స్ తోకముడిచి వెనుదిరిగాయి.
వరుసగా పాక్ చర్యలను భారత్ ధీటుగా తిప్పికొడుతుండటంతో పాక్ అయోమయంలో పడింది. అంతేకాదు భారత్ యుద్ధం వస్తే పాక్ కు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ప్రపంచవ్యాప్తంగా బలమైన దేశాలు ఇండియాకు మద్దతుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పాక్ ఇండితో కాళ్ళ బేరానికి వచ్చింది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ యుద్ధం వస్తే ఇరు దేశాలకు నష్టం జరుగుతుంది. పరిస్థితులు గతంలో జరిగిన రెండో ప్రపంచ యుధాన్ని తలపించవచ్చు. సమస్యలనుచర్చలతో పరిష్కరించుకోవటం మంచిదన్న ఇమ్రాన్ భారత్ తో చర్చలకు తాము సిద్ధం అని వెల్లడించారు.