కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, విశాఖ మాజీ కార్పొరేటర్ విజయా రెడ్డి మంగళవారం ఉదయం దారుణ హత్యకు గురయ్యారు.
తన నివాసంలోని బాత్ రూమ్ లో రక్తపు మడుగులో ఆమె శవమై తేలారు.
అపార్ట్మెంట్ కొనుగోలు చేయడానికి వచ్చిన వారే హత్య చేసి ఉంటారని అనుమానాలు కలుగుతున్నాయి.
ప్రస్తుతం విజయా రెడ్డి విశాఖ లోని అక్కయపాలెం ఎన్ జీజీఓ ఎస్ కాలనీలో పద్మ భాస్కర అపార్ట్మెంట్ లోని 5వ ఫ్లోర్ లో నివాసం ఉంటున్నారు.
విజయా రెడ్డి ఒంటిపై విచక్షణ రహితంగా కత్తులతో దాడి చేశారు దుండగులు.
దీనితో ఇల్లు అంతా రక్తపు మరకల తో నిండింది.
పోలీసులు కేస్ దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యకు సంబందించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
వీడియోలు కింద ఉన్నాయి.