తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పొలిటికల్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి మరోసారి తన నోటికి పని చెప్పారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారో. ఈ సందర్భంగా కెసిఆర్, మోడీలపై ఘాటు విమర్శలు గుప్పించారు రేవంత్ రెడ్డి. ఆయన ఏం మాట్లాడారో కింద ఉంది చదవండి.
దేశం వైపు ఎవడూ కన్నెత్తి చూడకుండా మోడీ చర్యలు తీసుకోవాలి. కేసీఆర్, మోడీది ఫెవికాల్ బంధం అని విమర్శించారు రేవంత్. ఒకే కేసులో ఎన్ని సార్లు విచారణ చేస్తారు? నాలుగేండ్లు తర్వాత ఈడీ కేసులు ఏంది నా మీద? కొడంగల్ లో డబ్బులు పంచిన కేసులో పట్నం నరేందర్ మీద కేసు లేదు. నాపై అక్రమంగా కేసులు పెడుతున్నారు అని ఆరోపించారు.
పాకిస్తాన్ తో యుద్ధం వస్తే…ఎన్నికలు జరగక పోవచ్చు. పోచారం తల్లి చనిపోతే రెండు సార్లు వెళ్లి వచ్చాడు. దేశం కోసం చనిపోయిన జవాన్ల కోసం నివాళి అర్పించే సమయం లేదు. పోచారం పక్కనే…పచ్చ జొన్న రైతులు ఆందోళన చేస్తున్నారు. కలిసి రావచ్చు కదా జై జవాన్ అంటే గౌరవం లేదు, జై కిసాన్ కి విలువ లేదు కేసీఆర్ కి. ఎర్రజొన్న రైతుల సమస్యకి వారం రోజులు డెడ్ లైన్ పెడుతున్నా. సమస్య పరిష్కరించకపోతే నేనే వెళ్తా ఆందోళనకు అని హెచ్చరించారు రేవంత్ రెడ్డి.
పార్టీ ఓటమి పై అంతర్గతంగా చర్చ చేస్తాం. ఎన్నికల్లో పోతులు ఉంటాయా లేదా అన్నది పీసీసీ చీఫ్ చెప్తారు. టీడీపీ తో లాభమా… నష్టం జరిగిందా అనేది పార్టీ వేదిక మీద చర్చ చేస్తాం. గ్రామాల్లో ఎన్నికలు పెట్టుకుని గాంధీ భవన్ కి వచ్చి ఏం చేయాలి? ఈడీ కేసుల బిజీ లో ఉండటం వల్ల సమీక్షలకు రాలేదు. టీడీపీలో ఉన్నప్పుడు కార్లో తిరిగాము… కాంగ్రెస్ లో హెలికాప్టర్ లో తిరిగా. నేను ఎక్కడున్నా కంఫర్ట్ గానే ఉంటా అని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి.