గండికోట ప్రయాణం
మనవీపు మనకు తెలియదు… మన టూరిజం కూడా అంత, మనవూరి పక్కనో, మన జిల్లాలోనోొ చూడాల్సిన అద్భతాలెన్నో ఉంటాయి. వాటిని విస్మరించి ఫ్లయిట్ టికెట్స్ కన్సెషనో, ట్రావెల్ కంపెనీ స్పెషల్ ఆపర్ అనో విదేశాలలో ఇలాంటి విశేషాలనే చూసొచ్చి గొప్పగా చెప్పుకుంటుంటాం. దీనికి భిన్నం మేం ముందు మనపక్కనే ఉన్న యాత్ర స్థలాలను చూడాలనుకున్నాం. దీనికి కడప జిల్లాలోన గండికోటను ఎంచుకున్నాం. మా ఆద్భుత యాత్రా విశేషాలను అందరితో పంచుకుంటున్నాం. మీరంతా కూడా తప్పక చూడాల్సిన కొట గండికోట.
2019 ఫిబ్రవరి నెలలో ఆరు మంది మిత్రులతో కడప జిల్లాలో పెన్ననది ఒడ్డున ఎత్తయిన కొండల మీద ఉన్న గండికోట టూర్‌కి వెళ్లాము. ముందుగా కర్నూల్ మీదుగా నంద్యాల, ఆళ్లగడ్డ మీదుగా జమ్మలమడుగు చేరుకున్నాం. అక్కడిని 12 కిమీ దూరంలో గండికోట ఉంటుంది.
గండికోట అనగానే మనకు గుర్తుకు వచ్చేది ‘గండికోట రహాస్యం’ సినిమా. అవును మీరు అనుకున్నట్టే… ఆ కోట రహాస్యమే… చూస్తే కానీ తెలియని అనుభూతులు ఆ కోటలో దాగున్నాయి.
ఆనాటి విజయనగర రాజులు కట్టిన కోటల్లో… ఓ అద్భుతమైన కోటగా ఈ గండికోట మిగిలిపోతుంది అనడంలో అతియోశక్తి లేదు. ఎందుకంటే… ఆ కోట నిర్మాణం అలాగా ఉంది మరీ. ఈ కోట గురించి చెప్పుకోవాలి అంటే… ముందుగా ఆనాటి ఇంజీనర్ల ముందుచూపు గురించి చెప్పుకోవాలి.
అసలే రాయలసీమ… ఆపై ఎటు చూసిన కొండలు, గుట్టలు తప్పా ఎక్కడ కూడా పచ్చిక బయళ్లు కనిపించని ఏడారి ప్రాంతమది. కానీ ఆ కొండల్లో… నిర్మించిన కోటలో ని # కత్తుల కోనేరు # ఇప్పటికీ…. కోటలోని గ్రామ దాహార్తిని తీర్చుతూ ఉందని గ్రామస్థులు చెబుతారు.
ఇక అసలు విషయానికొస్తే….
గండీకోట ప్రయాణానికి మనం హైదరాబాద్ నుంచి మొదలు పెట్టాలి అంటే…శంషాబాద్ మీదగా మన ప్రయాణాన్ని ఆరంభించాలి. ఉమ్మడి మహాబూబ్‌నగర్ మీదుగా కర్నూల్ చేరుకొని అక్కడి నుంచి వెళ్లవచ్చు. కర్నూల్ నుంచి రెండు దారుల్లో…. మనం జమ్మలమడుగు మీదుగా కోటలోకి ప్రవేశించవచ్చు.
ఒకటి కర్నూల్ చేరకున్నాకా… అక్కడి కొండరెడ్డి బురుజు చూసుకొని ‘రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రహాదారి’ మీదుగా కొద్ది దూరం వెళ్లాక… రైట్ సైడ్ రూట్లో బనగానపల్లి, కోయల్కుంట్ల, బేతంచెర్ల, నొస్సం మీదుగా జమ్మలమడుగు చేరుకోవచ్చు. ఈ దారిగుండా వెలితే… దాదాపు 162 కిలోమీటర్ల దూరం ఉంటది. అదే విధంగా… కర్నూల్ నుంచి నంద్యాల మీదుగా 170 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఎటు నుంచి వెళ్లిన ముందుగా మనం జమ్మలముడుగు చేరుకోవాలి. అక్కడ ఉన్న గాంధీ ( చౌరస్తా) సెంటర్ నుంచి 12 కిలో మీటర్ల దూరంలో ఉన్న గండీకోటకు చేరుకుంటాం. అయితే మనం జమ్మలమడుగు చేరుకోగానే…
గాంధీ సెంటర్ కి కొద్దిదూరంలోనే ఉన్న ‘ఫెమస్ టీ’ దుకాణంలో ఛాయ్ టేస్ట్ … ఓవ్. అలాగే గాంధీ సెంటట్ దాటి గండీకోట రోడ్డులో కొద్దిదూరం వెళ్తే… మనకు రాయలసీమ రుచులతో కూడుకున్న చిన్న చిన్న హోటళ్లు కడబడతాచయి. మనం చాలా దూరం వెళ్తాం కాబట్టి, అక్కడ ప్రత్యేకమైన # రాగి సంగటి ముద్ద # తినాల్సిందే. దాంట్లో నంజు కోవడానికి నాటు కోడి పులుసు లేదా… మేక తలకాయ పులుసు అలాగే టమాట చట్నీ వట్టివి ఉంటాయి, సో ఈ రూచి చూసిన తరువాతే మనం కోట వైపు ప్రయాణం చేయాలి. లేకపోతే… అక్కడి వెళ్లి అలసిపోవడం తప్పా ఏం చేయలేము.
హైదరాబాద్ నుంచి రైలులో వచ్చే వాళ్లు ముద్దునుూరు స్టేషన్లో దిగాలి. అక్క డినుంచి జమ్మలమడుగు టౌన్లోకి ప్రవేశించకుండా గండి కోట వెళ్లవచ్చు.
ఇక జమ్మలముడుగు గురించి మీరు విన్న బాంబుల వార్తలన్నీ మర్చిపోండి. ఆదొక సింపుల్ చారిత్రక పట్టణం. టౌన్ దాటుతూనే… మనకు ఒక పెద్ద వాగు మధ్యలో వస్తుంది. అది నిజానికి వాగు కాదు, ఎండిపోయిన పెన్నానది. నది మీదుగా బ్రిడ్జి దాటగానే కుడివైపు తీసుకొని సరిగ్గా పన్నెండు కిలో మీటర్లు వెళ్లే… గండీ కోట మనకు సాదరంగా ఆహ్వానం పలుకుతుంది. కుర్రాళ్లయితే జమ్మల మడుగు నుంచి షేరింగ్ ఆటో లో వెళ్లండి, దారిపొడుగునా రాయలసీమను కొండలు గుట్టలు చూడవచ్చు.
కోటలోకి దారి చూస్తుంటే… మనం మైమరిచి పోవాల్సిందే… ఎందుకంటే… ఆలాంటి రాయలసీమ పల్లెలు ఆలా స్వాగతం పలుకుతాయి.. కోటలోకి వెళ్తుంటే… గూడెంచర్ల (గూడెం చెరువు) ఊరు మీదుగా…
పోతుంటే…ఎదురుగా విండ్ పవర్ కి సంబంధించిన గాలి మరలు ఆకట్టుకుంటాయి, అలాగే కుడివైపు పెన్నానది అందాలు, మైలవరం డ్యాం మనకు స్వాగతం పలుకుతాయి. అలాగే అక్కడ గండికోట అడ్వవెంచర్ సైట్ కూడా ఉంటాయి. ఇక కోట దగ్గరికి రాగానే… ఘాట్ రోడ్డు మాదిరిగా వంపులు తిరుగుతూ… కోటలోకి వెళ్తుంటాం. ముందుగా మనకు అక్కడక్కడ టీ కొట్టు, హోటళ్లు కనబడుతాయి. అందులోనే గండికోట గ్రామంలో నివాసం ఉండే ప్రజలు మనకు కనిపిస్తుంటారు.
ఈ కోటను ఎర్రటి శానపు రాయితో నిర్మించారు. అసలు విషయం ఏంటంటే… ఈ కోటను కొండ రాతి పై పునాదులు లేకుండా గోడలు నిర్మించారు. ఈ గోడలు 10 నుండి 13 మీటర్ల ఎత్తున్నాయి. చతురస్రాకారంలోను, దీర్ఘ చతురస్రాకారంలోను 40 బురుజులున్నాయి. కోటలో ముందుగా కనిపించే టీ కొట్టులో మాత్రం టీ చాలా బాగుంటది. అలాగే కోటలోకి వెళ్లే ముందుకు హరిత రెస్టారెంట్ కూడా స్వాగతం పలుకుతుంది. ఇప్పుడు అసలైన కోటలోకి ప్రవేశిస్తుండగానే ఆనాటి కళావైభం మనల్ని ఆకట్టుకుంటాయి. అలా వెళ్తుంటే… ఎడమవైపు కారాగారం ( జైలు ) గదులు, దేవాలాయాలు దర్శనమిస్తాయి. అలా కుడివైపు తిరగానే… జూమా మసీద్ దానికి వ్యతిరేక దిశలోనే కత్తుల కోనేరు ఉంటాయి. పైన చెప్పిన విధంగా కోనేరులోని నీరుని ఒకసారి తాగాల్సిందే..,…
అలా కోటలో మన ప్రయాణం ముందుకు సాగిస్తుంటే…. జూమ మసీద్ పక్కనే ధాన్యాగారం, ఆ పక్కనే రంగానాయక స్వామి ఆలయం ఉంటాయి.
ఈ ఆలయం గురించిన మొట్టమొదటి ప్రస్తావన శా.1479 (క్రీ.శ.1557) నాటి ఒక శాసనంలో కనిపిస్తుంది. ఆ శాసనం గండికోట లోని రంగనాయకుని గుడికి భూమిని మాన్యంగా ఇచ్చినట్లు తెలుపుతుంది. ఈ ఆలయనిర్మాణశైలిని బట్టి చూస్తే రంగనాథాలయం నూటికి నూరు పాళ్ళూ విజయనగర రాజుల నిర్మాణం అని స్పష్టమౌతుంది. ఈ ఆధారాలను బట్టి ఈ ఆలయాన్ని క్రీ.శ.పదహైదవ శతాబ్దంలో నిర్మించినట్లు చెప్పవచ్చు. అక్కడ మాధవరాయ ఆలయం గోపురం మాత్రం కనిపిస్తుంది.దేవుడు లేకుండా కేవలం అద్భుతకళా ఖండంగా ఉండే గోపురం ఇదేనేమో. ఈ ఆలయం గురించిన మొట్టమొదటి ప్రస్తావన క్రీ.శ.పదహారవ శతాబ్దానికి చెందిన శాసనాలలో కనిపిస్తుంది. ఆలయంలో మనకు కనిపించే శిల్ప కళా లక్షణాలు, ఆలయనిర్మాణశైలిని బట్టి చూసినా ఆలయ నిర్మాణం అదే కాలంలో జరిగినట్లు తోస్తుంది. ఆలయనిర్మాణాన్నీ, అందలి శిల్పకళారీతుల్నీ, వాటి లక్షణాలనూ విశదంగా అధ్యయనం చేసిన మీదట ఈ ఆలయాన్ని క్రీ.శ.పదహారవ శతాబ్దం తొలినాళ్ళలో నిర్మించినట్లు చెప్పవచ్చు.
ఆలా ఆలయ దర్శనం చేసుకొని ముందు వెళ్తుంటే.. పెన్నా నది లోయ మనల్ని మంత్రముగ్దుల్ని చేస్తుంది. అక్కడి అందాలు మనల్ని కట్టిపడేస్తాయి. కోటలోంచి కింది దిగి అక్కడి నాపా రాళ్లపై పెన్నానది లోయవైపు పయనం చేస్తున్నప్పుడు ఈ వీచే గాలి మన మనసుకు హత్తుకుని చల్లని మత్తెక్కిస్తుంది. స్వచ్ఛమైన గాలిలో…. నాపారాయి మీద అడుగులు వేస్తూ… పై వరకి వెళ్లి నది లోయల అందాల్ని చూడవచ్చు. ఇప్పుడు అక్కడ లోయకు ఎడమ వైపు ఒక పెద్ద రహాదారి నిర్మిస్తున్నారు.
ఇలా పెన్నానది చూశాకా కోటలో తిరుగుతున్నప్పుడు అసలిపోకుండా ఉండాలి అంటే… కడప జిల్లా స్టైల్లో తయారు చేసిన చిన్న చిన్న పిండి వంటలు అక్కడ పండు ముసలమ్మలు…. అమ్మతుంటారు. వాటిని చప్పరించకుండా రాయలసీమను అర్థం చేసుకోవడం కష్టం.
ఇక కోటలో టాయిలెట్స్ ఉన్నా…. నిరుపయోగంగా ఉన్నాయి. నీటి వసతి లేక వాటి ఉపయోగం లేదు వాటిని బాగు చేసి శుభ్రంగా మెయింటేన్ చేసేందుకు కొత్తగా టూరిజం శాఖబాధ్యతలు స్వీకరించిన ధనంజయ్ రెడ్డి (కడప జిల్లా వాడే) శ్రద్ధ తీసుకోవాలి.
కోట దిగువన లోయలో పెన్నా నది ప్రవహిస్తూ ఉంటుంది. దీన్ని చూసే ఎవరో గ్రాండ్ క్యాన్యాన్ ఆప్ ఇండియా అని పిల్చారు. మీకు ఇంకా ఓపిక ఉంటే, పెన్నానదికి అవతలి ఒడ్డున ఆగస్తీశ్వర కోన ఉంటుంది. కోనలు రాయలసీమ ప్రత్యేకం.
ఇక్కడ మరో ముఖ్య విషయం చెప్పుకోవాలి. అక్కడి రాత్రి బస చేయడానికి ఒకే ఒక్క పున్నమి అతిథి గృహం ఉంటుంది. కానీ ఈ గెస్ట్ హౌస్‌లో దిగాలి అంటే… దాదాపు రెండు నెలల ముందే గదులు బుక్ చేసుకోవాల్సి ఉంటుందని చెబుతారు.. లేదంటే జమ్మలమడుగులోని చిన్న చిన్న లాడ్జిలు కూడా ఉంటాయి. అయితే కోట అందాలు మనం పూర్తిగా ఆస్వాదించాలి అంటే… ఎర్లీ మార్నింగ్ లేదా…సాయంకాలంలో వెళ్లాలి అప్పుడే మనం ఎంజాయి చేయవచ్చు.
ఇక తిరుగు ప్రయాణంలో మనం మొదట నంద్యాల నుంచి వెళ్తే…. తిరుగు ప్రయాణంలో మాత్రం ఖచ్చితంగా కోయలకుంట్ల, బేతంచర్ల మీదుగా వెళ్లాలి. ఎందుకంటే… ఆ దారిలో కోయలకుంట్ల దాటిన తరువాత కిలో మీటర్ల పోడువున దారికి రెండు వైపుల చింత చెట్లు… కనివిందు చేస్తాయి. అలాగే బేతంచర్ల దగ్గరల్లో అడవిలో కొద్దిగా ఉన్న ఘాట్ రోడ్డును కూడా మనం ఎంజాయి్ చేయవచ్చు. అలాగే స్టోన్ బిజినెస్ చేసే షాపులు కూడా చాలా చూడవచ్చు. ఇక బనగానిపల్లెలో వేడి వేడి అలసంద వడలు తినితిరాలి. ఇంత చవగ్గా ప్రపంచంలో ఎక్కడ వడలేనేవి దొరకవేమో. పది రుపాయలకు అయిదు వడలిస్తారు. ఇది రాయలసీమ స్పెషల్. తెలంగాణ రోడ్డు మళ్లీ కలిసే దాకా రాయలసీమ అడుగడుగునా మరిచిపోలేని జ్ఞాపకాలను మిగిలిస్తుంది.
-శ్రీనివాస్.కె, హైదరాబాద్, ఫోన్. 917013211961