వాలైంటైన్స్ డే సందర్భంగా ఆ ప్రేమికులు కళాశాల ఎదురుగా ఉన్న పార్క్ లో ముచ్చట పెడుతున్నారు. ఇంతలో భజరంగ్ దళ్ కార్యకర్తలు వారిని చుట్టు ముట్టి పెళ్లి చేశారు.
మేడ్చల్ జిల్లా సీఎంఆర్ కళాశాలకు చెందిన విద్యార్దులు కళాశాల ఎదురుగా ఉన్న ప్రాంతంలో ఏకాంతంగా ఉన్నారు. ఇంతలోనే వారిని భజరంగ్ దళ్ కార్యకర్తలు చుట్టుముట్టి బలవంతంగా తాళి కట్టించారు. వారు ఏం చేస్తారోనన్న భయంతో ఆ అబ్బాయి అమ్మాయి మెడలో తాళి కట్టాడు. అయితే ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీని పై స్పందించిన పోలీసులు భజరంగ్ దళ్ కార్యకర్తలను అరెస్టు చేశామన్నారు. ప్రేమికులకు బలవంతంగా పెళ్లి చేయడం నేరమన్నారు. భజరంగ్ దళ్ కార్యకర్తల పై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు. భజరంగ్ దళ్, ఆర్ఎస్ ఎస్ పేరుతో నీచంగా ప్రవర్తిస్తున్న వారిని తరిమికొట్టాలని పలు ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి.
ప్రేమికులకు పెళ్లి చేసిన వీడియో కింద ఉంది చూడండి.