చైన్ స్నాచర్ల ఆగడాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. చూస్తుండగానే కళ్లుగప్పి మెడలో గొలుసులు లాక్కెళ్లిపోతున్నారు. బండిపై వెళుతూ పక్కనే రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లే మహిళల మెడలో గొలుసులు లాక్కెళ్లిపోయిన వీడియోలు చాలానే చూశాము, విన్నాము. కానీ ఈ దొంగ మాత్రం ముసలమ్మను తెలివిగా బురిడీ కొట్టించాడు.
అడ్రెస్ అడుగుతున్నట్టు నటించి నిమిషంలో ఆమె మెడలో గొలుసు లాక్కుని వెళ్ళిపోయాడు. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ ముసలమ్మ పాపం లబోదిబోమంటూ ఆ దొంగని వెంబడించి కిందపడి గాయాలపాలైంది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో కింద ఉంది చూడవచ్చు.