పసుపు రైతులు ఆర్మూర్ లో మళ్ళీ రోడ్డెక్కారు. పసుపు కి మద్దతు ధర కల్పించాలని గత కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆర్మూర్ లో పసుపు రైతు ఆత్మ గౌరవ ర్యాలి పేరుతో పెద్ద ఎత్తున ర్యాలి నిర్వహించారు.
పసుపు రైతుల డిమాండ్లు ఇవి…
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కానీ ఆర్మూరులో కానీ వెంటనే పసుపు బోర్డు ఏర్పాటు చేసి ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చెయ్యాలి.
నందిపేట్ మండల కేంద్రంలో స్మార్ట్ ఆగ్రో మెగా పూడ్ పార్క్ ను త్వరగా ఏర్పాటు చేయాలి.
వేల్పూర్ మండలం లోని పడగల్ గ్రామంలో ఏర్పాటు చేస్తున్న పసుపు పార్క్ కుఅయ్యే వ్యయంమొత్తం 30.82కోట్లు విడుదల చేసి పారిశ్రామిక వేత్తలకు తగిన ప్రోత్సాహకాలు ఇచ్చి పసుపు పంటను కొనుగోలు చేసేలా కృషి చేయాలి.
పడగల్ నుండి పసుపు ను విదేశాలకు ఎగుమతి చేయడానికి ప్రత్యేక బ్రాండ్ సృష్టించాలి పసుపును 15 మద్దతు ధర కు కొనుగోలు చెయ్యాలి.
పసుపు శుద్ధి చేసే పరిశ్రమలకు రాయితిలిచ్చి పేద్దఎత్తున విదేశాలకు ఎగుమతి అయ్యేలా చూడాలి.
పసుపు సాగు పర్యవేక్షణకుప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలి ఒకవేళ ధర పడిపోతే ఈ విభాగం ద్వారా కొనుగోలు చేయాలి ఇందుకు 500 కోట్లతో ప్రత్యేక నిధి కేటాయించాలి రైతు తక్కువ ధరకు అమ్మి నష్టపోతే ఇ నిధి నుండి పరిహారం చెల్లించాలి.
రైతులకు నాణ్యమైన ఎర్రజొన్న మరియు పసుపు విత్తనాలను 75%రాయితితో రైతులకు అందించాలి ఇ రాయితీ కోసం బడ్జెట్లో 100 కోట్లు కేటాయించాలి.
పసుపు కొమ్ములు ఉడకబెట్టక అరబెట్టడానికి ఉరికి 15 చదరపు మీటర్ల సిమెంట్ కల్లాలు ఏర్పాటు చేయాలి.
పసుపు పంటను నిల్వ చేయడానికి 20 వేళా మెట్రిక్ టన్నుల సామర్థ్యమున్న గోదాముల ను నిర్మించాలి.
జాతీయ ఎలక్ట్రిక్ వ్యవసాయ మార్కెట్ ,ఇ నామ్ లో చేరి పసుపుని మార్కెట్లో ఆన్లైన్లో అమ్మకాలు జరిగేలా చూడాలి.
ఎర్ర జొన్న పంట మరో పది రోజుల్లో చేతికి వస్తుడంతో వ్యాపారులు రైతులను మోసాగించేందుకు పావులు కదుపుతున్నారు.
ప్రతి సారి రైతు ఎర్రజొన్న విత్తనాలను దళారుల దగ్గర అధిక ధరలకు కొనిరైతు మోసపోతున్నాడు ఇప్పుడీ నుండి రాష్ట్ర ప్రభుత్వం 75% రాయితితో విత్తనాలను సరఫరా చేయాలి.
గత ఏడాది లాగే ఈ సారికూడా రాష్ట్రప్రభుత్వం వెంటనే రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ ఐనాటువంటి టీ పి ఎస్ సి ద్వారా 4000 రూపాయలకు ఎర్రజొన్నలను కొనుగోలు చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు.