నాగార్జున సాగర్ కాల్వలో దూకి వివాహిత ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కుటుంబంలో చెలరేగిన వివాదాలే ఈ ఘటనకు కారణాలుగా తెలుస్తున్నాయి. నల్లగొండ పట్టణానికి చెందిన మహిళ తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి జీవనం సాగిస్తోంది. కాగా కొంతకాలం నుండి భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.
దీంతో మనస్థాపానికి గురైన మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. నల్లగొండ నుండి మిర్యాలగూడ శెట్టిపాలెం సాగర్ కెనాల వద్దకు స్కూటీపై వచ్చింది. కాల్వ దగ్గరకు రాగానే స్కూటీ పక్కన నిలిపి కాల్వలో దూకేసింది. అటుగా వెళుతున్న యువకులు ఆమెను కాపాడారు. అపస్మారక స్థితికి వెళ్లిన ఆ మహిళకు స్థానికంగా ఉన్న కూలీలు సపర్యలు చేసారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన వీడియో కింద ఉంది చూడండి.