టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రతిపక్షనేత జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్ కు రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు జగన్. చంద్రబాబు పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేశారని, నకిలీ ఓట్లను సృష్టించారని, వైసీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించారని సీఈసీకి జగన్ ఫిర్యాదు చేసిన జగన్ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆయన సీఈసీకి ఫిర్యాదు చేసిన అంశాలను మీడియాకి తెలిపారు. ఢిల్లీలో ఉన్న రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్షనేత తీరును తప్పుబట్టారు. ఆయన మీడియాతో ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే కింద ఉంది చదవండి.
ఢిల్లీ వచ్చిన ప్రతిపక్ష నేత జగన్ రాష్ట్రంలో ఉన్న సమస్యలపై, ప్రత్యేకహోదా, రాష్ట్ర విభజన చట్టం, ఉత్తరాంధ్ర సమస్యలపైన కేంద్రాన్ని ప్రశ్నించలేదు. నేరుగా ఈసీని సంప్రదించారు. ఆయన కేంద్రప్రభుత్వంతో లాలూచి రాజకీయాలు చేస్తున్నారని ఈ చర్యతో స్పష్టం అవుతోంది. ప్రత్యేకహోదాపై నేనే పోరాడుతున్నా అని చెప్పిన వ్యక్తి ఇక్కడి వరకు వచ్చి కనీసం ప్రెస్ మీట్ పెట్టైనా కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం గురించి నోరు విప్పలేదు. పోలీసు వ్యవస్థను దుర్వినియోగ పరుస్తున్నారని ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ ఢిల్లీలో ప్రతిపక్షనా నాయకుడు రాష్ట్ర పరువును తీయడం బాధాకరం అన్నారు.
సిఐలకు పదోన్నతి అనేది ఒక ప్రొసీజర్ ప్రకారం జరుగుతుందని అందులో అవకతవకలు జరిగే అవకాశం లేదన్నారు. గతంలో రాజశేఖర్ రెడ్డి ఏ సామాజికవర్గానికి పదోన్నతులు ఇచ్చారో ఒకసారి చెక్ చేసుకోవాలి అని సూచించారు. అయినా ఆయన అభియోగాలు చేశారు కాబట్టి మేము కూడా దీనికి సంబంధించిన నివేదిక ఇస్తామని తెలిపారు. నకిలీ ఓట్లు ఉన్నాయో లేదో తెలుసుకునే బాధ్యత ఈసీకి ఉందన్న ఆయన ప్రత్యేకంగా ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదన్నారు. నిర్దిష్టమైన వోటింగ్ ఉండాలనే మేము కూడా కోరుకుంటున్నామని స్పష్టం చేశారు ఎంపీ రామ్మోహన్ నాయుడు.