సొంత పార్టీ కార్యకర్తలే టిఆర్ఎస్ నాయకత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ జెండా దిమ్మె కూలగొట్టారు. రాళ్లు, గడ్డపారలతో దిమ్మె కూలగొట్టడం తో టెన్షన్ నెలకొంది.
ఈ సంఘటన కల్వకుర్తి నియోజకవర్గంలో జరిగింది. కల్వకుర్తి టిఆర్ఎస్ లో రెండు వర్గాలు ఉన్నాయి. అందులో ఒకటి తాజా ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ది కాగా మరొకటి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి వర్గం. ఎప్పటి నుండో ఈ రెండు వర్గాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది.
వీరి మధ్య విభేదాల కారణంగానే సొంత పార్టీ కార్యకర్తలు దిమ్మె కూల్చివేత కు పాల్పడ్డారని తెలుస్తోంది. ఈ ఘటన కల్వకుర్తి నియోజకవర్గంలోని మాడ్గుల మండలంలోని అందుగుల గ్రామంలో జరిగింది. గ్రామ ప్రజల కండ్ల ముందే కూల్చివేత జరగడంతో టెన్సన్ వాతావరణం నెలకొంది.
అసలు ఈ ఘటన ఎందుకు జరిగింది అనే వివరాలు తెలియాల్సి ఉంది.
దిమ్మె కూల్చివేత వీడియో కింద ఉంది చూడండి.