అమెరికాలో ఎనిమిది మంది తెలుగు యువకులను యుఎస్ హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు అరెస్టు చేశారు. వీళ్లలో కొందరు అమెరికన్ ఇండియన్స్ అయితే,మరికొందరు భారతీయులే. వందలాది విద్యార్థులు చట్టవ్యతిరేకంగా అమెరికాలో నివసించేందుకు వీరు తోడ్పడ్డారనే నేరం మీద యుఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం వీరిని అదుపులోకి తీసుకుంది. అరెస్టయిన వారి పేర్లు: కాకిరెడ్డి భరత్, సురేష్ కందల, కర్నాటి ఫణిదీప్, ప్రేం రాంపీస, సంతోష్ సామా, అవినాశ్ తక్కళ్ల పల్లి, అశ్వంత్ నూనె,నవీన్ ప్రతిపాటి.
ఇందులో ఆరుగురు డెట్రాయిట్ ఏరియాలో అరెస్టు చేస్తే ఇద్దరని వర్జీనియా , ఫ్లారిడాలో అరెస్టు చేసినట్లు ఐసిఇ ఒక ప్రకటనలో పేర్కొంది.
అమెరికాకు వచ్చిన చాలా మందిని విద్యార్థులని చెప్పి వారు అక్కడ నివసించేందుకు దోహదపడ్డారనేది వారి మీదవచ్చిన ఆరోపణ. హోమ్ లాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్ ఈ కుంభకోణాన్ని వెలికి తీశారు.
వాళ్ల మీద వచ్చిన అరోపణల ప్రకారం వందలాది మంది విదేశీయులను డెట్రాయిల్ లోని ఫార్మింగ్టన్ విశ్వ విద్యాలయం అనే ప్రయివేటు సంస్థ తరఫున రిక్రూట్ చేసుకుని 2017 ఫిబ్రవరి, 2019 జనవరి మధ్య ఈ తెలుగు వాళ్లు కుట్ర చేసి వారంతా అమెరికాలో ఉద్యోగాలు చేసేందుకు వీలుకల్పించారు.అ
అయితే కుట్రను కుట్రతోనే ఛేదించారు. ఫార్మింగ్టన్ విశ్వవిద్యాలయం అనేది హోం ల్యాండ్ సెక్యూరిటీ వాళ్లు నడిపే సంస్థ యే. ఈ విషయం తెలియక అరెస్ట వారంతా ఈ సంస్థతో ఒప్పందం చేసుకుని వారు వేసిన వలలో ఇరుక్కుపోయారు.
విద్యార్దులను ఆమెరికా ఆశ్రయం ఇచ్చేందుకు, ఇలా రిక్రూట్ చేసుకునేందుకు వీరంతా భారీగా డబ్బులు వసూలుచేసేవారు.
ఇలా రిక్రూట్ చేసున్నవారు విద్యార్థలని చూపించేందుకు ఈ ముద్దాయిలు విశ్వవిద్యాలయాలనుంచి దొంగ సర్టిఫికేట్లు పుట్టించేవారు. ఇలా తప్పుడు సర్టిఫికేట్లతో ఇమిగ్రేషన్ అధికారులను బోల్తా కొట్టించేవారు.
ఈ ఫేక్ విశ్వవిద్యాలయంలో అడ్మిషన్ సంపాదించేది చదివి డిగ్రీలు సంపాదించేందుకు కాదు, అక్కడ స్టూడెంట్ వీసా పొంది ఆ తర్వాత వర్క్ ఆధరైజేషన్ సంపాదించి మెల్లిగా అమెరికాలో తిష్ట వేశేశారు. అయితే, హోం ల్యాండ్ సెక్యూరిటీ వాళ్టు కూడా ఇపుడు ఇలాంటి ఫేక్ యూనివర్శిటీనే వాడుకునే కుట్రను భగ్నం చేశారు.