ఏపీ రాజకీయాల్లో విశాఖ ఉత్తర బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుది విభిన్న శైలి. ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఉన్నది ఉన్నట్టు మాట్లాడటమే కాకుండా అసెంబ్లీలో మంచి వక్తగా ఆయనకు పేరుంది. ఇటీవలే ఆయన పార్టీ మారతారంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. అయితే వాటిని ఖండించిన ఆయన మరోసారి పార్టీ మారడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. అంతేకాదు సొంత పార్టీపైనే సెన్సేషనల్ కామెంట్స్ చేసారు.
గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీ మారడంపై స్పందించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుండే పోటీ చేస్తారా అని ప్రశ్నించగా సమాధానాన్ని దాటవేశారు. రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ నుండి పోటీ చేస్తారు అనేది మాత్రం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక చెబుతాను అన్నారు. ఇక ప్రస్తుత పరిస్థుల్లో బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు ఏ పార్టీ అయినా ముందుకు వస్తుందా అని సొంత పార్టీ గురించే ఇలా విమర్శించడం విశేషం.