తెలంగాణ ఎన్నికల ఫలితాలు అందరికి పెద్ద షాక్ ని ఇచ్చాయి అనడంలో అతిశయోక్తి లేదు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు, అందులోనూ పొలిటికల్ ఫైర్ బ్రాండ్, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఓడిపోవటం అందరిని ఊహించని షాక్ కి గురి చేసింది. అయితే ఎన్నికల ముందు అనేక సర్వేలు హడావిడి చేశాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే వీటిలో లగడపాటి రాజగోపాల్ సర్వే ఒక ఎత్తు. ఆయన సర్వేతో ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠకు తెర తీసింది. ఆయన సర్వేలో కూటమి గెలుస్తుందని వెల్లడించారు.
లగడపాటి సర్వేలకు మంచి పేరుంది. ఒకటి రెండు తేడాలు తప్ప ఫలితాలలో పెద్ద మార్పు ఉండదు. ఇక ఆయన సర్వే కూటమికే ఓటేయడంతో కూటమి విజయం తధ్యం అనుకున్నారంతా. కానీ సర్వే బెడిసికొట్టింది. ఫలితాలు ఊహించని రీతిలో తారుమారయ్యాయి. దీంతో అందరూ ఖంగు తిన్నారు. అయితే దీనిపై ఈసారి గట్టిగా నోరు విప్పారు లగడపాటి రాజగోపాల్. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఎన్నికల ఫలితాలపై సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే పూర్తిగా కింద ఉండి చదవండి.
సుమారు నెలన్నర తరువాత నేను ఈ రోజు మీడియా తో మాట్లాడుతున్నాను. డిసెంబర్11 వ తారీకు తెలంగాణ ఫలితాలు నాకుఆశ్చర్యాన్ని కలిగించాయి. 12 సంవత్సరాల్లో మొదటిసారి నా అంచనా తలకిందులు అయింది. నెలన్నర నుండి ఫలితాలపై నేను చాలా విశ్లేషణ చేసాను. ఈవీఎంలు టాంపరింగ్ చేశారు అని చాలా మంది ఆరోపించారు. పోలింగ్ శాతం చెప్పటానికి ఈసీకి చాలా సమయం పట్టింది. వివిపాట్ లు లెక్క పెట్టాలని నేను భావిస్తున్నాను.
పంచాయితీ ఎన్నికల్లో అధికార పార్టీకంటే, విపక్షాల సీట్ల శాతం కంటే ఓట్ల శాతం చాలా పెరిగింది. నేను స్పందించకపోవటం తో చాలా చాలా కథనాలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. అందుకే స్పందింస్తున్నాను.
నేను ఎవరి ఒత్తిడిలతో అబద్ధాలు చెప్పను. నేను చెప్పిన మాటకు కట్టుబడి ఉంటాను. వోటింగ్ శాతం చెప్పటానికి ఈసీకి ఒకటిన్నర రోజు ఎందుకు పట్టింది? ఎన్నికలప్పుడు అప్పటి పరిస్థితులను బట్టి మేము అంచనాలు చేసి చెప్తాము.
ఎన్నికల్లో అవకతవకలు జరిగాయి అని నేను భావిస్తున్నాను. వివిపాట్స్ లెక్కించాలని నేను భావిస్తున్నాను, ప్రభుత్వాన్ని, ఈసిని విమర్శించట్లేదు. చంద్రబాబు ను కలిసిన తరువాత ప్రెస్ మీట్ పెట్టడం కాదు, నాపై వచ్చిన ఆరోపణలపై పెట్టాను. అన్ని కరెక్ట్ గానే జరిగాయని తేలితే నేను క్షమాపణ చెప్తాను. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత పంచాయితీ ఎన్నికల్లో పార్టీలే ఉండవు కానీ అలా జరుగలేదు. రాబోయే ఎన్నికల్లో నేను ఎప్పుడు కూడా ఫలితాలు ముందు చెప్పను.ఎన్నిక అయ్యాక చెప్తాను.
ఇండిపెండెంట్లు ఎందుకు ఒడిపోయారో కూడా నాకు తెలుసు పార్లమెంట్ ఎన్నికల తరువాత బయటపెడతాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు లగడపాటి. రాష్ట్ర ముఖ్యమంత్రితో చాలా సందర్భాల్లో మాట్లాడాల్సి ఉంటుంది. అందుకే కలిశాను, అందర్నీ కలుస్తాను. నేను ఏ పార్టీలో లేను. రాజకీయాల్లోకి వస్తే తప్పకుండా నేను అందరికి చెప్పి చేస్తాను. గతంలో నేను తెలంగాణ నుండి పోటీ చేసే అవకాశం ఉంది అన్నాను ఇప్పటికీ దానికి కట్టుబడి ఉన్నాను. ఆంధ్ర ఎన్నికల్లో జగన్, కెసిఆర్ కలిసి టిఆర్ఎస్-వైసీపీ పొత్తు చేసుకున్నా తప్పేంలేదు. ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చు అని లగడపాటి తెలిపారు.
Vadu oka bafun…CBN acting cheayamatea cheasthunadu