తెలంగాణలో శాసనసభ ఎన్నికలలాగే పంచాయితీ ఎన్నికలు కూడా వాడివేడిగా సాగాయి. సర్పంచ్ ఎన్నికను ఇటు టీఆరెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్, సర్పంచ్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించుకోవడానికి ప్రత్యేక దృష్టి సారించారు అనడంలో అతిశయోక్తి లేదు. ఇదిలా ఉండగా సూర్యాపేట జిల్లాలో సర్పంచ్ ఎన్నికల్లో వార్డు మెంబర్ గా పోటీలో ఓడిన అభ్యర్థి ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ అయ్యారు. ఎందుకో తెలియాలంటే కింద ఉన్న మ్యాటర్ చదవండి.
ఎన్నికల్లో వార్డ్ మెంబెర్ గా పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి ఇంటింటికి తిరిగి ఓటు వేయమని ఇచ్చిన నా డబ్బులు నాకు ఇవ్వండి. మీకు దండం పెడతా… నాకు ఇద్దరు ఆడపిల్లలు వున్నారు వారి పెళ్లి చెయ్యాలి… అని అడుగుతున్నాడు. సూర్యాపేట జిల్లా, అర్వపల్లి మండలం, జాజిరెడ్డిగూడెం గ్రామంలో కాంగ్రెస్ రెబెల్ (వార్డ్ మెంబర్) గా పోటీ చేసి ఓడిపోయాడు ప్రభాకర్.
దీంతో ఇంటి ఇంటికి తిరిగి తాను వోట్ కోసం ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని అడుగుతున్నాడు. నన్ను ఓడించారు కాబట్టి నా డబ్బు నాకు ఇవ్వండి అని ఓటర్లను తిడుతున్నాడు. ఓటర్లు కూడా ప్రభాకర్ ను ఎదురు తిడుతున్నారు. ఎవరు ఇవ్వమన్నారు అని నిలదీస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ వీడియో కింద ఉంది చూడండి.