ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఓవైసి కొత్త వివాదంలో చిక్కుకున్నారు. ఘనతంత్రి దినోత్సవం సందర్భంగా ఆయన జాతీయ జెండా ఎగురవేసిన సందర్భంలో జాతీయ జెండాకు వందనం (సెల్యూట్) చేయలేదు. అలాగే జాతీయ జెండా ఆవిష్కరణ సమయంలో జెండాను కిందనే ఓపెన్ చేసి పైకి పంపించారు.
సాధారణంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన వెంటనే సెల్యూట్ చేయడం సాంప్రదాయంగా వస్తున్నది. కానీ ఎంపీ అసద్ మాత్రం జాతీయ గీతం ఆలపించారు కానీ జెండాకు వందనం (సెల్యూట్) చేయలేదు. ఎంఐఎం పార్టీ పై గతం నుంచీ జెండా వందనం విషయంలో, జాతీయ గీతమైన జనగనమన పాడే విషయంలో వివాదాలు ఉన్నాయి.
తాజాగా అసదుద్దీన్ ఆ వివాదాలకు కొనసాగింపుగా జాతీయ జెండాను ఆవిష్కరించినా, జెండాకు సెల్యూట్ చేయకుండానే జాతీయ గీతం ఆలపించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనిపై వివాదం రాజుకుంటున్నది.
అసదుద్దీన్ జెండావిష్కరణ తాలూకు వీడియో కింద ఉంది.