అనంతపురం మాజీ పోలీసు అధికారి గోరంట్ల మాధవ్ శనివారం ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. జగన్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి సంతోషంగా ఆహ్వానించారు. గత కొంతకాలంగా గోరంట్ల మాధవ్ పొలిటికల్ ఎంట్రీ విషయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన రాజీనామా చేసినప్పటి నుండి పార్టీలో ఎప్పుడు చేరతారా అని అంతా ఎదురు చూసారు. కాగా ఆయన గణతంత్ర దినోత్సవం రోజునే పార్టీలో చేరారు. అయితే ఇదే రోజు పార్టీలో చేరడంపై ఆయన మీడియా ఎదుట స్పందించారు.
రిపబ్లిక్ డే రోజు పార్టీలో చేరడంపై ఆయన సంతోషం వ్యక్తం చేసారు. ఆయన ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే… “ఈ సుదినాన వైసీపీలో చేరడం చాలా సంతోషంగా ఉంది. బి.ఆర్.అంబేద్కర్, పూలె వంటి వారు బడుగు బలహీన వర్గాలను బలోపేతం చేయాలనే ఆశయంతో ముందుకు వెళ్లారు. వారి ఆశయాలనే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు పరిగణలోకి తీసుకున్నారు. బడుగు బలహీన వర్గాల నాయకత్వం పెంపొందించాలి, పార్టీని వారికీ మరింత చేరువ చేయాలి అనే ఉద్దేశంతో జగన్ నన్ను పార్టీలోకి ఆహ్వానించారు.
నేను ఈ బడుగు బలహీన వర్గాల ఆలోచనావిధానాన్ని ముందుకు తీసుకువెళ్తూ… జగన్ మోహన్ రెడ్డిగారి బాటలో నడవాలని ఈరోజు ఈ పార్టీలో చేరాను. జగన్ మోహన్ రెడ్డిగారి ఆశయ సాధన కోసం అనంతపురం జిల్లాలో కష్టపడి పార్టీని ముందుకు తీసుకు వెళ్తాను” అని తెలిపారు మాజీ కదిరి సిఐ, వైసీపీ నేత గోరంట్ల మాధవ్. దీనికి సంబంధించిన వీడియో కింద్ ఉంది చూడండి.
వీడియో కర్టెసి: సాక్షి
Super sir