కదిరి మాజీ సిఐ గోరంట్ల మాధవ్ శనివారం ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గణతంత్ర దినోత్సవం నాడే ఈ పోలీసు అధికారి జగన్ సమక్షంలో పార్టీలో చేరడం విశేషంగా చెప్పుకుంటున్నారు వైసీపీ శ్రేణులు. స్వయంగా పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ కండువా కప్పి ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించారు.
కానిస్టేబుల్ గా డిపార్టుమెంటులో అడుగుపెట్టిన ఆయన అంచలంచెలుగా ఎదిగారు. పోలీసు శాఖలో ప్రత్యేక ఇమేజ్ సంపాదించారు. తప్పు చేసింది ఎంత పెద్దవారైనా ఆయన మాత్రం స్ట్రిక్ట్ గా విధులు నిర్వహించేవారని టాక్ ఉంది. దూకుడుగా డ్యూటీ చేస్తూ అనేకసార్లు వార్తల్లో నిలిచారు.
గతంలో అనంతపూర్ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి మెలేసి మరీ వార్నింగ్ ఇచ్చి సంచలనం సృష్టించారు. అసలు ఆయన మీద ఛాలెంజ్ గానే మాధవ్ రాజకీయాల్లోకి వస్తున్నట్టు పలువురు చర్చించుకుంటున్నారు. కానీ ఆయన మాత్రం పేదవారికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వస్తున్నట్టు గతంలో అనంతపూర్ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి మీసం వివరించారు.
అయితే ఇటీవలే ఆయన తన పదవికి రాజీనామా చేసారు. అయితే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేముందే తన పదవికి రాజీనామా చేయాలనీ జగన్ కండిషన్ పెట్టినట్లు సమాచారం. ఈ మేరకే ఆయన కొద్దిరోజుల క్రితమే తన పదవికి రాజీనామా చేసారు. అయితే ఆయన హిందూపూర్ పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తారంటూ ఎప్పటి నుండో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంపై ఇంకా అధిష్టానం మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.