తెలంగాణ ఎన్నికల్లో కొడంగల్ లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ఈ అనూహ్య పరిణామం తర్వాత ఆయన కొంతకాలం నిశ్శబ్దం వహించారు. ఇన్ని రోజులు స్తబ్దుగా ఉన్న రేవంత్ ఒక్కసారిగా దూకుడు పెంచారు. ఎవరూ ఊహించని రీతిలో టీఆరెస్ కు షాక్ ఇచ్చారు.
ఎన్నికల నిభందనలు ఉల్లంఘించి ,అక్రమాలతో కొడంగల్ లో పట్నం నరేందర్ రెడ్డి గెలిచారని ఆరోపించారు. ఈ విషయంలో అక్కడ గెలిచిన పట్నం నరేందర్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని పిటిషన్ వేశారు. రేవంత్ రెడ్డి ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుండీ సైలెంట్ గా ఉండి ఇప్పుడు హైకోర్టులో కేస్ వేయడం హాట్ టాపిక్ అయింది.
అయితే రిజల్ట్స్ వెల్లడైనప్పటి నుండి కాంగ్రెస్ నేతలు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈవీఎం ట్యాపరింగ్ జరిగిందని కెసిఆర్ ప్రభుత్వంపై ప్రధానంగా ఆరోపించారు. కొడంగల్ లో వీవీ ప్యాట్ లో పోల్ అయిన ఓట్లకు కౌంట్ అయిన ఓట్లకు తేడా ఉందని వార్తలు వచ్చాయి. అయితే రేవంత్ దీనిపై సాక్ష్యాలు సేకరించి కోర్టులో పిటిషన్ వేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆయన తగిన ఆధారాలు సేకరించి గురువారం హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు సమాచారం.
హైకోర్టులో డీకే అరుణ కూడా పిటిషన్
పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్ల తేడా ,ఈసీ నిబంధనలను ఉల్లంఘించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేను అనర్హుడిగ ప్రకటించాలని డీకే అరుణ పిటిషన్ వేశారు