జగన్ పై జరిగిన హత్యాయత్నం కేసును ఎన్ ఐఏకి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ సర్కార్ వేసిన పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. వైఎస్ జగన్ పై వైజాగ్ విమానాశ్రయంలో దాడి జరిగింది. దీనిని ముందుగా రాష్ట్ర పోలీసులు విచారించారు. అయితే విమానాశ్రయం కేంద్ర పరిధిలోదని అలాగే ఏపీ పోలీసుల విచారణ పై తమకు నమ్మకం లేదని వైసిపి నాయకులు హైకోర్టులో పిటిషన్ వేశారు. వారి వాదనలతో ఏకీభవించిన కోర్టు ఎన్ ఐఏకి జగన్ కేసు విచారణను అప్పగించింది.
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే దానిని విచారణకు స్వీకరించకుండా హైకోర్టు తిరస్కరించింది. ఎన్ ఐఏకి అప్పగించడంలో తప్పేం లేదని దీనిని ఎన్ ఐఏనే విచారిస్తుందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఏపీ సర్కార్ కు ఎదురు దెబ్బ తగిలింది.