గత కొంత కాలంగా కేబుల్ బిల్లుల పెంపు పై ఆందోళన నెలకొంది. కొత్త నిబంధనలు వచ్చాయని దానికనుగుణంగా మార్పులు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం చెప్పడంతో టివి ప్రేక్షకుల్లో ఆందోళన నెలకొంది. టివి ప్రేక్షకులకు ఊరట కలిగించేలా ట్రాయ్ నిర్ణయాన్ని ప్రకటించింది. 100 ఉచిత ఛానళ్లు లేదా ప్రేక్షకులు కోరుకునే 100 పే చానళ్లను 153. 40 రూపాయలకే అందించాలని ఆదేశాలు జారీ చేసింది.
కేబుల్ కనెక్షన్ అయినా, డిటిహెచ్ అయినా ఇదే ధరకు అందించాలని సర్వీసు ప్రొవైడర్లకు సూచించింది. దీని పై వివరాలకు ఈ నెల 31 వరకు ఆపరేటర్లను వీక్షకులు సంప్రదించాలని తెలిపింది. దీని పై సందేహాలుంటే 011- 23237922 కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని తెలిపింది.
ఇది తప్పు వార్త. ట్రాయ్ పేరుతో జరుగుతున్న అసత్యపు ప్రచారాలలో ఇది కూడా ఒకటి. 26 దూరదర్శన్ చానల్స్ తో బాటు కోరుకున్న ఇంకో 74 చానల్స్ ను ఇంటివరకు తెచ్చినందుకు మన కేబుల్ ఆపరేటర్ కు ఇచ్చే 130 రూపాయలు 18% పన్నుతో కలిసి 153.40 అవుతుంది. ఇది కాకుండా మనం పే చానల్స్ కు వాటి ధరల ప్రకారం డబ్బు కడితే చానల్ యజమానులకు ఆ డబ్బు పోతుంది. అందువలన మనం పే చానల్స్ కు డబ్బు కట్టనక్కరలేదని పొరబడకూడదు