ఆస్ట్రేలియాలో డ్రైవర్ లెస్ రైలు… అది తయారయింది ఆంధ్రలో…

నిన్న ఆస్ట్రేలియా ప్రపంచ వార్త లెక్కింది. ఆస్ట్రేలియా మహానగరం సిడ్నిలో డ్రైవర్ లేకుండా ఒక మెట్రో రైళ్లు నడపాలనే ప్రాజక్టులో భాగంగా సోమవారం నాడు ఒక  డ్రైవర్ లెస్  మెట్రో రైలుని పరీక్ష కోసం నడిపారు. ఇది విజయవంతమయింది. డ్రైవర్ లెస్ రైలు ఆస్ట్రేయలియాలో నడవడం ఇదే మొదటి సారి. కొన్ని పరీక్షల తర్వాత ఏప్రిల్ నుంచి సిడ్నీ మెట్రో  డ్రయివర్ లెస్ రైళ్లను పూర్తి స్థాయిలో నడుపుతుంది. సిడ్నీలో  నార్త్ వెస్ట్ కార్రిడార్ లోని రౌస్ హిల్ – చాట్స్ వుడ్ మధ్య ఈడ్రైవర్ లెస్ రైళ్ల నడిచింది.   ఈ రైలు నార్త్ వెస్ట్ మెట్రో లో 36 కిమీ టెస్ట్ జర్నీని విజయవంతంగా పూర్తి చేసింది. న్యూ సౌత్ వేల్స్ ప్రధాని గ్లాడిస్ బెరెజిక్లియన్, ట్రాన్స్ పోర్ట మినిస్టర్ యాండ్రూ కాన్ స్టాన్స్ తో పాటు పెద్ద సంఖ్యలో అధికారులు హర్షధ్వానాలతో ఈ రైలుకు చాట్స్ వుడ్ లో స్వాగతం పలికారు.  ఇది సిడ్ని మెట్రో లో డ్రైవర్ లెస్ రైళ్లకు మొదటి దశ మాత్రమే. దాదాపు 12 బిలియన్ డాలర్ల ఖర్చుతో ఈ లైన్ ను సిబిడి, సిడెన్ హామ్, బ్యాంక్స్ టౌన్ దాకా విస్తరించాలనుకుంటున్నారు. ఇది ఆస్ట్రేలియాకు పెద్ద వార్త. అలాగే మిగతా ప్రపంచానికి కూడా పెద్ద వార్తే.

ఇందులో ఆంధ్రా వాళ్లకు ఇంకా పెద్ద వార్త ఉంది. అదేమిటంటే, ఈ రైలు తయారయింది ఆంధ్రలోనే. చిత్తూరు జిల్లాలోని శ్రీసిటిలో ఈ రైలు కూర్పు జరిగింది. శ్రీ సిటిలో ఒక ఫ్రెంచ్ కంపెనీ అల్ స్టామ్ (Alstom) వీటిని అసెంబుల్ చేసింది. శ్రీసిటి నుంచి మొదటి విడత అరు బోగీలు గత ఏడాది జూలై లో సిడ్నీకి అందించారు. నార్త్ వెస్ట్ రైల్వే కంపెనీ కోసం అల్ స్టామ్ 6 బోగీలుండే 22 రైళ్లను అందించింది. అవన్నీ ఆస్ట్రేలియా చేరుకున్నాయి. తమాషా ఏమిటంటే, శ్రీ సిటిలోని ఆంధ్రప్రదేశ్ లో భాగం అనడం కంటే, చెన్నైకి సమీపంలో అని రాసేస్తున్నాయి విదేశీ పత్రికలు. సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ ఇలా రాసింది.

Assembled in Sri City near Chennai in south-east India, the six carriages of the first driverless metro train to be shipped to Sydney will undergo a final fitout at a new maintenance depot at Rouse Hill.The fleet built by French manufacturer Alstom for the north west line will eventually boast 22 six-car trains.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *