ఈ రోజు విడుదలయిన ‘పేట’లో కొత్త దనం లేదనిపించినా, పాత బంగారం తళుక్కులున్నాయి. చాలా మంది హీరోలు హీరోలు గానే ఉండిపోతారు. సక్సెస్ వుతారు. రజనీకాంత్ హీరో గా మాత్రమే ఉండిపోకుండా తనకంటే ఒక స్టయిల్ రూపొందించుకున్నారు. అది రజనీకాంత్ సిగ్నేచర్. ప్రేక్షకులు దాన్ని చూసి మోజుపడ్డారు. ఇలాంటి యూనిక్ స్టయిల్ ఉన్న సూపర్ స్టార్ లు చాలా తక్కువు. సహాజంగా ఉండే గుణాలు కావివి. నటనలో అలవర్చకుని సొంతం చేసుకోవడం. పేట సినిమా కేవలం ఈ రజనీ సిగ్నేచర్ స్టయిల్ వాడుకుని హిట్ చేద్దామనుకున్నప్రయత్నం. ఈ ప్రయత్నం బాగా కనబడుతుంది.ఇది ఎంతవరకు సఫలమవుతుందో ఇపుడే చెప్పలేం. అయితే సమృద్ధిగా ఒరిజినల్ రిజినీ కాంత్ ను చూపించారు డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్. ఒరిజినల్ రజనీ కాంత్ కనిపించక చాలా కాలమయింది. సైన్స్ ఫిక్షన్ ఆయన కనపించకుండా కప్పేసింది.
అందుకే రజనీకాంత్ ని రజనీకాంత్ గా మళ్లీ చూడాలనుకునిప్రేక్షకులు ఎదరుచూస్తున్నట్లు ధియోటర్లలో వారి స్పందన చూస్తే అర్థమవుతుంది. పేట మంచి మాస్ మూవీగా తయారయింది. అయితే, తెలుగు పేట… డబ్బింగ్ లా కనిపిస్తుంది. కథలో రజినీ కాంత్ అక్రమాల మీద పోరాటం చూసే యోధుడు. ఈ క్రమంలో ఆయన మీద హత్యాయత్నం కూడా జరుగుతుంది. ఇలా మామూల మసాల దట్టించారు. కథలో గొప్పతనం లేదు. రొటీన్ కథ. ఈకథకి రజిని స్టయిల్ ప్రాణం పోసింది.
సిమ్రాన్, విజయ్ సేతుపతి, త్రిష, నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రలు పోషించారీ చిత్రంలో. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అదిరింది. రజినీకాంత్‌కు అనిరుధ్ సంగీతం అందించడం ఇదే మొదటిసారి. ఈ ప్రయత్నం విజయవంతమయింది. సినిమా మీద భారీ అంచనాలున్నాయి. దీనికితోడు సంక్రాంతి కానుకగా విడుదల. ట్విట్టర్ లో స్పందన ఇలా ఉంది.
One word Review –
B – L – O – C – K – B – U – S – T – E – R😎— Telugu movie Reviews (@UrstrulyHNEe) January 10, 2019
#PETA mass movie. Ignore all reviews and watch to enjoy the mass styled action pack movie of #SuperstarRajinikanth worth evey minute. #superhit
— Sujay’s Photography (@Sujaysphoto) January 10, 2019
Apart from the routine story #Ranjinikanth selected a different story.. Even though they haven’t revealed anything about his past in the first half, they entertained audience very well waiting for the second half#PetaReview #Peta
— Pathangi Tollywood (@PathangiTolly) January 10, 2019
నటీనటులు: రజనీకాంత్, సిమ్రన్, త్రిష, విజయ సేతుపతి, నవాజుద్దీన్ సిద్ధిఖీ, బాబీ సింహా, యోగిబాబు; సంగీతం: అనిరుధ్ రవిచంద్రన్; సినిమాటోగ్రఫీ: తిరు, ఎడిటింగ్: వివేక్ హర్షన్ ;నిర్మాత: కళానిధి మారన్, అశోక్ వల్లభనేని;దర్శకత్వం: కార్తీక్ సుబ్బరాజు