తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్, పిసిసి వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి మంగళవారం కొడంగల్ లో పర్యటించారు. ఆయన రాక సందర్భంగా కార్యకర్తలు, నాయకులు ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు.
మొన్న జరిగిన ముందస్తు ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కొడంగల్ లో 9వేల పైచిలుకు ఓట్ల తేడాతో టిఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. అయితే పట్నం సోదరులు కొడంగల్ మీద సీరియస్ గా దృష్టి కేంద్రీకరించడంతో తాండూరును నిర్లక్ష్యం చేశారు. దీంతో కొడంగల్ లో గెలిచిన ఆనందం కంటే తాండూరులో ఏకంగా మంత్రి ఓటమిపాలవడం బాధను మిగిల్చింది.
నిత్యం ఏదో ఒక సంచలన విషయాన్ని వెలుగులోకి తెస్తూ రేవంత్ రెడ్డి ఎన్నికలు జరిగే వరకు వార్తల్లో ఉండేవారు. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన మీడియాకు దూరమయ్యారు. ఒకటి అరా సందర్భాల్లో తప్ప అసలు మీడియా ముందుకే రావడంలేదు.
ఫలితాలు వచ్చినప్పుడు కొద్దిసేపు మీడియాతో మాట్లాడి ఫలితాలపై విశ్లేషించుకుంటామన్నారు. ఆ తర్వాత ఒకసారి కొడంగల్ లో పర్యటించిన సమయంలో మీడియాతో మాట్లాడారు. ఇలా రెండుమూడు సందర్భాల్లో తప్ప రేవంత్ రెడ్డి మీడియా జోలికి రావడమే మానేశారు.
అయితే మంగళవారం కొడంగల్ లో రేవంత్ రెడ్డి పర్యటించిన సందర్భంలో పార్టీ నాయకుడు ఒకరు తన కొత్త కారును రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేయించి ఓపెనింగ్ చేయించారు. ఆ వీడియో కింద ఉంది చూడండి.