శ్రీకృష్ణదేవరాయ బాటలో చంద్రబాబు రాజశ్యామల యాగం (5 వీడియోలు)

రాజులు, రాజ్యాలు అంతరించిపోయాయి. కానీ నవీన కాలంలో మళ్లీ ఆనాటి కాలానికి వెళ్లేందుకు పాలకులు పోటీ పడుతున్నారు. చరిత్రలో చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు వేసిన బాటలో కేసిఆర్ నడిచారు. కేసిఆర్ ను కాపీ కొట్టి చంద్రబాబు ఇప్పుడు కేసిఆర్ బాటలో నడుస్తున్నారు. అసలు వివరాలు చదవండి.

చరిత్రలో శ్రీకృష్ణదేవరాయలు రాజశ్యామల యాగం చేశారు. తన అధికారం పదిలపరచుకునేందుకు ఆ చక్రవర్తి రాజశ్యామల యాగం చేసినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. శ్రీకృష్ణ దేవరాయలు తర్వాత దక్షిణ భారతదేశంలో ఇంకెవరూ రాజశ్యామల యాగం చేసినట్లు ఆనవాళ్లు లేవు.

అయితే తెలంగాణ సిఎం కేసిఆర్ మొన్న నవంబర్ లో ముందస్తు ఎన్నికలకు కొద్దిరోజులకు ముందు రాజశ్యామల యాగం చేశారు. ఈ యాగం చేయాలని కేసిఆర్ కు శారదాపీఠాధిపతి స్వరూపానంద సరస్వతి ఉపదేశించారు. దీంతో ఆయన ఆదేశానుసారం కేసిఆర్ యాగం చేశారు. ముందస్తు ఎన్నికల్లో అఖండ విజయం సాధించి తిరిగి ముఖ్యమంత్రి అయిపోయారు. ఆ ఎన్నికలు మగిసిన వెంటనే కేసిఆర్ తన దేశ పర్యటనలో భాగంగా విశాఖటప్నం వెళ్లి స్వరూపానంద సరస్వతికి సాస్టాంగ ప్రణామాలు చేసి ధన్యవాదాలు తెలిపి ఒడిషా వెళ్లిపోయారు.

ఇక యజ్ఞాలు, యాగాల మీద పెద్దగా పట్టింపులు లేనట్లు కనబడే చంద్రబాబు కూడా కేసిఆర్ యాగం వివరాలు ఆరా తీశారు. ఆంధ్రాలో ప్రముఖ జ్యోతిష్య పండితుడు వేణుస్వామి ఇక్కడ ఎంట్రీ ఇచ్చారు. చంద్రబాబును కూడా రాజశ్యామల యాగం చేయాలని ఆదేశించారు.

వేణుస్వామి ఉపదేశాన్ని అంగీకరించిన చంద్రబాబునాయుడు కూడా రాజశ్యామల యాగం చేయాలని పండితులను కోరారు. గుంటూరు జిల్లాలోని చీరాలలో వేణుస్వామి చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు రాజశ్యామల యాగం చేశారు. ఆ యాగం చేసిన తర్వాత యాగ ఫలాన్ని తీసుకుని చంద్రబాబు వద్దకు వచ్చి ఆశీర్వదించారు. వాటికి సంబంధించిన ఎక్స్ క్లూజీవ్ వీడియోలు కింద ఉన్నాయి చూడండి.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *