కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కుందూరు జానారెడ్డినికి నాగార్జునసాగర్ నియోజకవర్గం ప్రజలు ముఖ్యంగా గిరిజన తండాల ప్రజలు శిక్షించారని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెశిడెంట్ కె టి రామారావు అన్నారు.
ఈ రోజు తెలంగాణ భవన్ లో టిఆ ర్ ఎస్ లో చేరిన నాగార్జున సాగర్ నియోజకవర్గ౦ వివిధ పార్టీల నేతలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా జానా రెడ్డి ఓటమికి ఒక పెద్ద కారణముందని ఆయన అన్నారు.
ఆయన మాటల్లోనే…
‘‘మొన్నటి ఎన్నికల్లో trs గెలుపు సామాన్యమైంది కాదు..ఇతర పార్టీల నుంచి మహామహులు కాలికి బలపం కట్టుకుని తిరిగినా తెలంగాణ ప్రజలు ధృడ సంకల్పం తో trs ను గెలిపించారు. నల్లగొండ లో జానారెడ్డి వంటి మహామహులు మట్టికరిచారు.
నల్గొండలో trs పార్టీయే నైతికంగా అన్ని స్ధానాలు గెలుచుకుంది.ట్రక్కు గుర్తు వల్లే నకిరేకల్ లో ఓడిపోయాం. మంత్రులు గా ఉన్నపుడు జానా రెడ్డి ,ఉత్తమ్ లు నల్లగొండ జిల్లా ఫ్లోరోసిస్ సమస్య పై దృష్టి పెట్టనే లేదు.
అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తన జిల్లా చిత్తూరు కు వేల కోట్లు తాగునీటి కోసం కేటాయించినా జానారెడ్డి ,ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రేక్షక పాత్ర వహించారు . జానా ,ఉత్తమ్ లు పదవులను పట్టుకుని వేలాడారు తప్ప ప్రజగ గురించి ఆలోచించనే లేదు.
అందుకే జానా రెడ్డి ని మొన్నటి ఎన్నికల ప్రచారంలో తండాల్లో ఏమి చేశావని నిలదీశారు. జానా రెడ్డి ఓడి పోవడం లో 76 తండాలు ప్రముఖ పాత్ర వహించాయి,’’ అని కెటి రామారావు వివరించారు.