తమిళనాడు మినిష్టర్ పి. బాలకృష్ణ రెడ్డికి మూడేళ్ళ జైలు శిక్ష విధిస్తూ సోమవారం న్యాస్థానం తీర్పు వెల్లడించింది. ప్రజా ఆస్తిని ధ్వంసం చేసినట్టు 20 ఏళ్ళ క్రితం నమోదైన కేసులో ఈయనకు శిక్ష పడింది. మూడేళ్లకు పైగా జైలు శిక్ష ఖరారు అవడంతో బాలకృష్ణారెడ్డిపై శాసన సభలో అనర్హత వేటు పడింది. కాగా జైలుకు వెళ్లకుండా ఉండేందుకు ఆయన పైకోర్టులో కేసును అప్పీలు చేసుకునే అవకాశం ఉంది.
ఆ కేసు పెండింగ్ లో ఉంది. అయినప్పటికీ శాసనసభలో ఆయన సభ్యత్వం కోల్పోయారు. కాగా తమిళనాడులో జయలలిత తర్వాత అక్రమాస్తుల కేసులో జైలుకు వెళుతోన్న రెండో మినిష్టర్ ఈయనే. శాసనసభ నుండి బాలకృష్ణను తొలగిస్తే తమిళనాడులో మొత్తం 21 శాసన సభ స్థానాలు ఖాళీగా ఉంటాయి. మొత్తానికి ఎఐఎడిఎంకె కి మరో షాక్ తగిలింది.