బిగ్ బ్రేకింగ్: జనసేనలోకి భూమా అఖిలప్రియ ?

మంత్రి అఖిలప్రియ పార్టీ మారనున్నట్టు తెలుస్తోంది. గత కొన్ని కర్నూలులో భూమా వర్సెస్ పోలీస్ డిపార్ట్మెంట్ లా పరిణామాలు చోటు చేసుకున్నాయి.

ఐదు రోజుల క్రితం ఆళ్లగడ్డలో కొందరి ఇళ్లలో తెల్లవారుఝామున కార్డాన్ సర్చ్ నిర్వహించారు పోలీసులు.

ఈ వ్యవహారం అఖిలప్రియకు ఆగ్రహం తెప్పించింది. నేర చరిత్ర లేనివారి ఇళ్లలో తనిఖీలు నిర్వహించి వారిని ఇబ్బంది పెడుతున్నారంటూ అఖిలప్రియ ఆరోపించారు. వెంటనే తనకు ప్రభుత్వం నియమించిన గన్ మెన్లను వెనక్కి పంపించారు.

పోలీసుల విషయంలో మంత్రి అఖిలప్రియ ఆగ్రహం చల్లారలేదు. అఖిలప్రియకు మద్దతుగా తన సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డి కూడా సోమవారం తన గన్ మెన్లను వెనక్కి పంపించారు. ఈ వివాదంతో కర్నూలు రాజకీయాలు వేడెక్కాయి.

భూమా ఫ్యామిలీ తీరు ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాగా అఖిల ప్రియ పార్టీ మారనున్నట్టు తెలుస్తోంది. భూమా అఖిలప్రియ జనసేనలో చేరబోతోందా?

తండ్రిబాటలో…

భూమా కుటుంబానికి, చిరంజీవి,పవన్ కుటుంబానికి ఎప్పటి నుంచో  మంచి సంబంధాలున్నాయి.

చిరంజీవి  ప్రజారాజ్యం  పార్టీ ఏర్పాటు చేసినపుడు భూమా దంపతులు ప్రజారాజ్యం లో చేరారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం సమయంలో భూమా దంపతులు వైసిపికి మారారు. 2014 ఎన్నికల ప్రచారానికి వెళ్ళి తిరిగి వస్తుండగా భూమా శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదం లో మరణించిన సంగతి తెలిసిందే.  ఇపుడు అఖిల కూడా  జనసేన లో చేరవచ్చనే చర్చ నడుస్తోంది.

శోభానాగిరెడ్డి మరణానంతరం ఎన్నికల కమిషన్ అళ్లగడ్డ నియోజకవర్గం ఎన్నికలను వాయిదా వేసింది. తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిని నిలబెట్టాలని బాబు భావించడంతో అఖిలప్రియ పవన్ కు ఫోన్ చేసి మాట్లాడినట్లు చెబుతారు.

తనకు సోదరిలాంటి భూమా శోభానాగిరెడ్డి కుమార్తె మీద  పోటీ పెట్టవద్దని పవన్ వారించడంతో బాబు వెనక్కు తగ్గారని, అపుడు ఆమె వైసిపి అభ్యర్థిగా  ఏకగ్రీవంగా గెలవడం తెలిసిందే.

తర్వాత  ఇబ్బందికర పరిస్థితుల్లో భూమా నాగిరెడ్డి ఆయన కుమార్తె అఖిలప్రియలు టిడిపిలో చేరారు.

ఆ తర్వాత  భూమా నాగిరెడ్డి హాఠాత్తుగా మరణించడంతో  ఖాళీ అయిన నంద్యాల   స్థానానికి  ఉప ఎన్నిక  జరిగింది. అపుడు టిడిపి అభ్యర్థిగా భూమా సోదరుని కుమారుడు భూమా బ్రహ్మానందరెడ్డి పోటీ చేసి గెలిచారు.

ఈ ఉప ఎన్నికల్లో పవన్ తటస్థంగా ఉన్నారు. ఆ సమయంలో అఖిలప్రియ పవన్ తమకు మేనమామ లాంటివారని ఆయన ఆశిస్సులు ఎప్పుడూ తమకే ఉంటాయని ప్రకటించారు.

ఆ తర్వాత భూమా అఖిల ప్రియకు మంత్రిపదవి ఇచ్చి, నాగిరెడ్డి అనుచరుడైన సుబ్బారెడ్డిని అఖిల ప్రియకు వ్యతిరేకంగా చంద్రబాబు ప్రోత్సహిస్తూ ఆమెను ఇబ్బందులు పెట్టడం ప్రారంభించారు.

అఖిల ప్రియ అనుచరులపై కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టడం, కార్డాన్ సెర్చ్ పేరుతో భయబ్రాంతులకు గురిచేయడం ఇందులో భాగమేనని అంటున్నారు. దీనితో  మంత్రి అఖిలప్రియతో తన గన్ మెన్లను  తిరస్కరించారు.తర్వాత ఈ రోజు  బ్రహ్మానందరెడ్డి కూడా తమ గన్మెన్లను ఉపసంహరించుకుని జన్మభూమి కార్యక్రమాలలో రక్షణ లేకుండానే తిరుగుతున్నారు. ఇది టిడిపి మీద నిరసనగా నే భావిస్తున్నారు. వారిక పార్టీలో ఉండరని తొందర్లోనే వెళ్లిపోతారని అంతా అనుమానిస్తున్నారు.

అమె వైసి పి లోకి వెళ్లే అవకాశం లేదు.బిజెపి రాష్ట్రంలో ఎదగడం లేదు. అందువల్ల  మిగిలింది జనసేనేయే. తనను మేనమామలా చూసుకునే పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేనలో భూమా అఖిలప్రియ చేరడం దాదాపూ ఖాయమని నంద్యాల ప్రాంతమంతా ఒకటే చర్చ.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *