రైతుబంధు చెక్కుల పై టిఆర్ ఎస్ ను ఇరుకు పెట్టిన ఎన్నికల కమిషన్

బతుకమ్మ, బోనాలు, యాగాలు, యజ్ఞాలు, పుష్కరాలు ప్రారంభోత్సవాలు ఇలా సంబురాలతో కాలం నెట్టుకొస్తున్న తెలంగాణ టిఆర్ ఎస్ ప్రభుత్వాన్ని  ఎన్నికల కమిషన్ ఇరుకున పెట్టింది.
చాలా అట్టహాసంగా రు. 5200 కోట్ల రుపాయలను రైతు బంధు పథకం కింద పంపిణీ చేసి సంబురాలు చేసుకుని ఎన్నిలకలకు వెళ్లాలనుకున్న టిఆర్ ఎస్ ప్రభుత్వం ఉత్సాహం మీద కమిషన్ నీళ్లు చళ్లింది.
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున బహిరంగ కార్యక్రమాలు ఏర్పాటు చేసి చెక్కులను పంపిణీ చేయవద్దని ఎన్నికల కమిషన్ తెలంగాణ ఎన్నిలక ప్రధానాధికారి కార్యాలయానికి ఆదేశాలు జారీ చేసింది.
ఈ డబ్బును 52 లక్షల మంది లబ్దిదారులకు, ఎకరానికి నాలుగువేల రుపాయల చొప్పున చెక్కుల రూపంలో పంచాలి. అంటే కుటంబానికి మినిమం నాలుగు వేల నుంచి అయిదారు లక్షల దాకా వస్తుంది. ఇంత డబ్బు ఒక్క సారి చేతికి రావడం కంటే సంబురం ఏముంటుంది.  మే నెలలో ఈ చెక్కులను టిఆర్ ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలు పండగలాగా జరిపారు.  ఎన్నికల ముందు ఇలాగే మరొక పండుగ జరపవచ్చని అనుకున్న టిఆర్ ఎస్ నేతల ఉత్సహాన్ని ఎన్నికల కమిషన్ నీరు కార్చింది.
 
 రైతుల బంధు కింద రైతులకు అందించాలనుకుంటున్న ఎకరానికి నాలుగువేల రుపాయల చెక్కును పంపిణి చేయ్య వచ్చని చెబుతూనే డబ్బును   బ్యాంకులకు ఎలెక్ట్రానిక్ ట్రాన్స్ ఫర్ చేయమని  ఎన్నికల కమిషన్ చెప్పింది.
చెక్కుల పంపిణీ పండగ లాగా జరపడానికి వీల్లేదని చెప్పింది. దీనితో చెక్కుల పంపిణీలో ఉన్న మజా  ఇపుడు టిఆర్ ఎస్ కు దొరక్కుండాపోయింది. డబ్బు చడీచప్పుడు లేకుండా బ్యాంకల్లో రైతుల అకౌంట్లలో పడుతుంది. 
గతంలో ఇలా పండుగ లాగా జరిగేది
 అంతేకాదు, దీనికి పబ్లిసిటీ ఇవ్వడం చేయవద్దని చెప్పారు. ఒక్కటిఆర్ ఎస్ రాజకీయ నాయకుడు కూడా ఈ డబ్బు పంపిణీ వ్యవహారంలో జోక్యం చేసుకోరాదని కూడా ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.  ఈ మేరకు తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ కు కమిషన్ చాలా స్పష్టమయిన ఆదేశాలిచ్చింది.  ఎన్నికల కమిషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎస్ కె రుదోలా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయానికి కూడా సమాచారం అందించారు.
రాష్ట్రానికి అందించిన సమాచారం ప్రకారం, రైతుబంధు పథకం నిధులను ముందు గుర్తించిన రైతులకే ఇవ్వాలి. కొత్త రైతులను చేర్చడానికి వీల్లేదు.
కమిషన్ ఈ విషయాలలో ముూడు షరతులు విధించింది.
1. ఎలాంటి పబ్లిసిటీ చేయడానికి వీల్లేదు.
2. చెక్కుులు, కానుకలు, కిట్లు… పంచడానికి వీల్లేదు. వాటికోసం ఎలాంటి పబ్లిక్ పంక్షన్ ఏర్పాటుచేయడానికి వీల్లేదు. 
3. టిఆర్ ఎస్ నేతలెవరూ ఈ డబ్బు పంపిణీ లో  ప్రమేయం ఉండరాదు.
ఇలాంటి ఉత్తర్వులు వస్తాయని వూహించి, రాష్ట్ర ప్రభుత్వం చెక్కుల పంపిణీ చేయడం మొదలు పెట్టడంతో  ఎన్నికల కమిషన్ ఆఘమేఘాల మీద  శుక్రవారం సాయంకాలం ఈ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ పథకం కింద వ్యవసాయ శాఖ 52 లక్షల మంది లబ్దిదారులను ఎంపిక చేసి వాటికి రు.5200 కోట్లు పంచాలని నిర్ణయించింది. 
నల్గొండలో  జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ శుక్రవారం నుండి రైతులకు రైతుబంధు చెక్కులను పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రకటించిన సంగతి తెలిసిందే. శుక్రవారం నాడు చెక్కలు పంపిణీ కి అధికారులు కూడా భారీగా ఏర్పాట్లు చేశారు.శుక్రవారం నాడు పది జిల్లాలలో చెక్కుల పంపిణీ జరిగింది. సోమవారం నాడు మిగతా జిల్లాలలో పంపణీ చేయాలనుకున్నారు. ఇది ఎన్నికల కమిషన్ తెలిసింది. అంతే, జాప్యం చేస్తే చెక్కుల పండగ జరుగుతుందని శుక్రవారం రాత్రి అర్జంటు గా ఉత్తర్వులు జార ీచేశారు.
ఎన్నికల ముందు బతుకమ్మ చీరెలు,  రైతు బంధు చెక్కుల పంపిణీ చేసి తెలంగాణలో ఫీల్ గుడ్  ఫీలింగ్ క్రియేట్ చేయాలనుకున్న టిఆర్ ఎస్ ప్రభుత్వానికి ఇది ఎదురుదెబ్బ. కాంగ్రెస్ చేసిన ఫిర్యాదుతో మొన్న బతుకమ్మ చీరెల కానుకల పంపిణీని నిషేధించిన ఎన్నికల కమిషన్ ఇపుడు చెక్కుల పంపిణీ ని ఆపేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *