వరంగల్ అగ్గి రవ్వలు కొండా దంపతులు. వారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, వైసిపిలో ఉన్నా, తుదకు టిఆర్ఎస్ లో ఉన్నా, రేపు మళ్లీ కాంగ్రెస్ లో అయినా వారు ఏం చెబితే అదే చెల్లుబాటు కావాల్సిందే.
అలాంటి కొండా దంపతులు ఇరకాటంలో పడే ఘటన ఇది. వారు వైసిపికి గుడ్ బై చెప్పి టిఆర్ఎస్ లో చేరిన సమయంలో ఒక టివికి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో వారు చెప్పిన సమాధానాలు ఇప్పుడు వారిని ఇరకాటంలోకి నెట్టేశాయి.
వైఎస్ సిఎంగా ఉన్న సమయంలో తమ నియోజకవర్గానికి నిధులే ఇవ్వలేదని, టిఆర్ఎస్ లోకి వచ్చిన తర్వాత కేసిఆర్ నిధుల వరద పారించారని చెప్పారు. తమకు ఇక టిఆర్ఎస్ పార్టీని వీడిపోవాల్సిన అవసరమే లేదన్నారు. 270 కోట్ల నిధులు ఇచ్చిండు కేసిఆర్ అని కూడా చెప్పారు.
ఇదంతా బాగానే ఉన్నప్పటికీ వారు తాజాగా టిఆర్ఎస్ ను వీడిపోయారు. అయితే కొండా దంపతులు టిఆర్ఎస్ ను వీడినా తమ సాంప్రదాయాన్ని మాత్రం వీడలేదు. గతంలో మాదిరిగానే బహిరంగ లేఖ రాసి మరీ టిఆర్ఎస్ ను వీడారు. ఆ సాంప్రదాయంపై వారి వివరణ కింద వీడియోలో ఉంది చూడండి.
అంతేకాదు వారు ఇంకా కేసిఆర్ గురించి, వరంగల్ లోని ఎర్రబెల్లి, కడియం గురించి కూడా ఏమన్నారో చూడండి.