మిర్యాలగూడ అమృత చేస్తున్న కొన్ని కామెంట్స్ వివాదాస్పదమవుతున్నాయి. ఆమె తెలసి, తెలియక మాట్లాడుతోందని కొందరు అంటుంటే మరికొందరు మాత్రం అమృత విషయంలో ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు.
పైగా సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నవారిపై పోలీసు కేసులు పెడతామని అమృత వార్నింగ్ కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో అమృత తీరును తప్పుపడుతూ మంచిర్యాల సంకసర్ల సువర్ణ అనే యువతి ఫేస్ బుక్ లోని తన వాల్ మీద పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
అమృత లేవనెత్తిన అంశాలకు సంబంధించి సువర్ణ సంధించిన ప్రశ్నలు కింద ఉన్నాయి. చదవండి. ఆమె ఫేస్ బుక్ లో చేసిన పోస్టు కూడా కింద ఉంది చూడొచ్చు.
అమ్మా అమృతా!
సోషల్ మీడియాలో నీకు వ్యతిరేకంగా కామెంట్స్ చేసేవారందరిని ఐ పి అడ్రెస్ లతో సహా గుంజి కేస్ ఫైల్ చేయించి కోర్టుకు ఈడుస్తానన్నావు కదా చాలా బాగుంది.కానీ కొన్ని చిన్న చిన్న డౌట్స్ ఉన్నవి కొంచం సమాదానం చెప్పగలవా..
1. 9 వ తరగతి ప్రేమను తప్పు పడుతున్నారు మాకు అవగాహన వచ్చాకనే పెళ్లి చేసుకున్నాము అని మీరు అన్నారు. మీరు ఇద్దరు ఎంత వరకు చదువుకున్నారు, ఉద్యోగాలు సంపాదించి స్థిరపడ్డాక మీ తల్లిదండ్రులను అడిగితే ఒప్పుకోలేదా అందుకే వాళ్ళని కాదని పెళ్లిచేసుకున్నారా ?
2. మీ పెళ్లయి కొన్ని నెలలు మాత్రమే అయింది అందుకే నీకు కష్టం అంటే,జీవితం అంటే ఏంటో కూడా తెలియదు ఒకవేళ 2 ,3 సంవత్సరాల తర్వాత నీకు నీ భర్తకి గొడవలు జరిగితే మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళేదానివి కాదా?
3. మీ పెళ్లి వల్ల సమాజంలో ఒక్కరైనా బాగుపడ్డారా?
4. నీకు వయసు లేదు, చదువు లేదు, సమాజం అంటే ఏమిటో కూడా తెలియదు అలాంటి నీకు అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని కొద్దిమంది పెద్దలు వాఖ్యలు చేశారు.నీకు ముందు, నీకు తర్వాత ఎంతో మంది చనిపోయారు ఎవరు పట్టించుకోలేదు నిన్నే ఎందుకు ఇంతలా పొగిడేస్తున్నారు?
5.ఆర్మీ లో దేశం కోసం చనిపోయిన యుద్ధ వీరులకు ఎటువంటి ఆదరణ లభిస్తోంది అని పోస్ట్ పెడితే నీకు నచ్చలేదు మరి నీ భర్త దేశానికి ఎం చేసాడు?నీకెందుకు ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు, భూమి,14 లక్షల పరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది?
6.మీరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు చాలా మంచిపని చేశారు. మిమ్మల్ని చూస్తుంటే ప్రేమకు ఆదర్శంలా కనిపిస్తున్నారు. అలాంటి ప్రేమగా ఉండే నువ్వు నీ తండ్రి నీ భర్తని చంపాడని నీ కడుపులో ఉన్న బిడ్డ బయటకు వచ్చేలోపు నీ తండ్రి చావాలన్నావు అంటే నువ్వు కళ్ళు తెరవక ముందు నుండి నీకు ప్రణయ్ కలిసేవరకు నీ తండ్రి నిన్ను కళ్ళల్లో పెట్టుకుని పెంచింది ప్రేమ కాదా?
7. కష్టపడి నీకు ఏ లోటు రాకుండా స్కూల్ లో చదివిస్తేనే కదా నువ్వు ప్రణయ్ ని కలిసావు. ప్రణయ్ ది మాత్రమే ప్రేమ నా.ఒకవేళ నిన్ను చదివించకుండా ఉంచితే అతను పరిచయం అయ్యేవాడా?
ఒకసారి ఆలోచించు ఇప్పుడు నిన్ను పొగిడిన వాళ్ళు ఎవరు కొన్ని రోజుల తర్వాత నీకు కనపడరు. ఆడదానికి ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త లేకపోతే ఎలా ఉంటుందో అందరూ అర్థం చేసుకున్నారు, నీకు కూడా సపోర్ట్ చేశారు. అందుకే నీ భర్తను చంపిన నీ తండ్రికి చట్టపరంగా శిక్ష పడుతుంది జీవితం అన్నాక విమర్శలు తప్పవు. నీకు అర్థం చేసుకునే వయసు, తెలివి రెండు లేవు.అడిగిన వాళ్ళందరి మీద కేస్ లు ఎన్నని పెట్టగలవు.సమాజాన్ని నువ్వొక్కదానివే ఏమి మార్చలేవు. ముందు నీ గురించి ,నీ కడుపులో ఉన్న బిడ్డ భవిష్యత్తు గురించి ఆలోచించు.
సువర్ణ సంకసర్ల