అక్రమ మైనింగ్ కార్యకలాపాలతో అరకు ఎమ్మెల్యేకిడారి సర్వేశ్వరరావు ఆ ప్రాంతంలో బాగా అపకీర్తి పాలయ్యారనే విమర్శ ఉంది. మీడియాలో కూడా ఈ మేరకు రిపోర్టులు వచ్చాయి.దీనితో కిడారి మీద ఆ ప్రాంతంలో కొన్ని వర్గాల ప్రజలలో బాగా వ్యతిరేకత ఉంది. ముఖ్య ఆయన మైనింగ్ కార్యకలాపాల వల్ల ప్రజలు ఆయనకు దూరం కావడమే కాదు, ఎదురు తిరగడం కూడా మొదలుపెట్టారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలుపొంది కిడారి టీడీపీలో చేరేందుకు కారణం కూడా తన అక్రమ మైనింగ్ కార్యకలాపాలకు రక్షణ ఉంటుందనే. రెన్నెళ్ల కిందట కిడారి సర్వేశ్వరరావుకు హుకుంపేట మండలం గూడ గ్రామస్తులు ఎదురుతిరిగారు.
చాలా కాలంగా వారు ఎమ్మెల్యేకి చెందిన క్వారీను మూసేయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. రెన్నెళ్ల కిందట దాదాపు పద్నాలుగు రోజుల పాటు ఆందోళన చేపట్టారు. అయినా ఎమ్మెల్యే ఖాతరు చేయలేదు. ఈ ధోరణికి నిరసనగా గూడ గ్రామం నుండి హుకుంపేట మండల కార్యాలయం వరకు గ్రామస్తులంతా పాదయాత్ర కూడా చేశారు. ఎమ్మెల్యేకి, ఆయన మద్దతునిస్తున్న,టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పలు నిరసన కార్యక్రమాలు ఇంకా చేపడుతూనే ఉన్నారు..
అంతేకాదు, ఇక్కడి ప్రజలు బహుళ జాతి కంపెనీలు బాక్సైట్ మైనింగ్ జరపకుండా అడ్డుకుంటున్నారు. గిరిజన ప్రాంతాలను ంచి ముఖ్యంగా ఏజన్సీ ప్రాంతాలనుంచి తెలుగుదేశం తరఫున ఎమ్మెల్యేలు గెలవలేదు. చంద్రబాబు ప్రభుత్వం బాక్సైట్ మైనింగ్ ను జరిపించాలని చూస్తున్నది.ఇందులో భాగంగా ఈ ప్రాంతంలోని గిరిజన ఎమ్మెల్యేల మద్దతు సంపాదించే పనిలో పడ్డారు. ఈ ఆకర్షణలో పడి వైసిపి వదిలి టిడిపిలో చేరిన వారిలో కిడారి ఒకరు. ప్రభుత్వంతో ఉండి,మైనింగ్ మద్దతిస్తే లాభసాటి అని కిడారి గ్రహించారు. పార్టీ మారారు. సొంతంగా కూడా చిన్న చిన్న క్వారీలను నిర్వహిస్తున్నారు.
అయితే మావోయిస్టులు కిడారిపైన దాడి చేయడానికి ప్రధాన కారణం బాక్సయిట్ వ్యవహారమని తెలుస్తోంది. ఏజెన్సీ ప్రాంతంలో పలువురు బాక్సయిట్ తవ్వకాలు జరుపుతున్నారు. వీరికి కిడారి మద్దతు ఇస్తున్నాడని భావించిన మావోయిస్టులు పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది. అయినప్పటికీ బాక్సయిట్ తవ్వకాలు ఆగకపోవడంతో ఆగ్రహించిన మావోయిస్టులు కిడారి, శివేరి సోమపై కాల్పులు జరిపి అతి కిరాతకంగా చంపేశారని అందరికి అనుమానం.
బాక్సైట్ మైనింగ్ కార్యకలాపాలకు మద్దతు ఇవ్వవద్దని కిడారిని చాలా సార్లు మావోయిస్టులు హెచ్చరించారని, ఆయన వాటిని ఖాతరు చేయలేదని అంటున్నారు. ఫలితంగా మావోయిస్టుల హిట్ లిస్టులోకి ఆయన పెరు ఎక్కంది.