వరంగల్ ఈస్ట్ లో గతంలో 45 వేల భారీ మెజారిటీ తో గెలిచినా…టిఆర్ఎస్ మొదటి లీస్ట్ లో నాపేరు లేకపోవడం భాధ కలిగించిందని సీనియర్ నాయకురాలు మాజీ మంత్రి కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ రోజు ఆమె మీడియా ముందు తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఆమె అన్న మాటలివి
జిల్లాలో 12 లో 11 స్థానాలు ప్రకటించి బీసీ మహిళ గా నా పేరు ప్రకటించకపోవడం బాధాకరం…
2014 లో పరకాల నుంచి పోటిచేయలనుకున్నా..కేసీఆర్ వరంగల్ ఈస్ట్ లో బస్వరాజు సారయ్య ను ఓడించాలి మీరు పోటిలో ఉండాలని కోరారు..ఇష్టం లేకున్నా పోటిచేసాను. ఏంపీ ని కూడా మా సొంత డబ్బులు పెట్టి గెలిపించాం. కార్పోరేషన్ ఎన్నికల్లో ,ఏమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ గెలుపు కు కూడా మా సొంత డబ్బులు పెట్టి గెలిపించాం.
ఇప్పటి వరకు పార్టీ వ్యతిరేకంగా మాట్లడలేదు.మహిళకు మంత్రి పదవి ఇవ్వని ప్రభుత్వం టిఆర్ఏస్ ప్రభత్వం.నాకు హామీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వకున్నా…అభివృద్ధి కోసం పార్టీ లో ఉన్నాను. నా భర్త మురలీధర్ రావు పార్టీ సపోర్ట్ లేకుండా సొంతంగా ఏమ్మెల్సీ ఏన్నికల్లో గెలిచారు..ప్పటి వరకు పార్టీ నుంచి ఏటువంటి లాభం పొందలేదు.వరంగల్ జిల్లా లో నే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మాకు అభిమానులున్నారు…పార్టీ తో సంబంధం లేకుండా మమ్మల్ని గెలిపిస్తున్నారు.
టిఆర్ఏస్ మోదటి లీస్ట్ లో నాపేరు లేదంటె కేవలం నన్ను కాదు బీసీ మహిళలందరిని మోసం చేసారు..నన్ను ,బుడిగె శోభ ,నల్లాల ఓదెల ,బాబు మోహన్ వీళ్ళంతా ఏస్సీలు…బీసీ ,ఏస్సీ లను కేసీఆర్ పక్కన పెట్టారు.
ఏర్రబెల్లి దయాకర్ రావు ను ,గుండు సుధారాణి ,బస్వరాజు సారయ్య ను పార్టీ లో చేర్చుకునె ముందు మాకు చెప్పలేదు..
మా తర్వాత పార్టీ లోకి వచ్చిన ఏర్రబెల్లి కి ఏంధుకు పార్టీ లో అంత ప్రాధాన్యత..
ఇప్పుడు ప్రకటించిన అభ్యర్థుల అందరికీ బీ ఫామ్స్…ఇస్తారనే నమ్మకం ఉందా?
కేటీఆర్ రెండు రోజుల కింద ఫోన్ చేసి భూపాలపల్లి టికెట్ ఇవ్వలేక పోతున్నాం..పరకాల లో పోటీ చేయండి, మీరు పోటి చేస్తారా ,మీ పాప పోటీ చేస్తారా అని అడిగితే ..మా కుటుంబ సభ్యుల ను అడిగి చెప్తా అన్నాను…
రెండు టిక్కెట్లు అడిగామని దుష్ప్రచారం చేస్తున్నారు..నాకు పరకాల టిక్కెట్ ఇస్తా అంటే ఓకే అని చెప్పా…
అయినా పొమ్మనక పొగబెడుతున్నారు. మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు…
రెండు మూడు రోజుల్లో మా నిర్ణయం భహిరంగ లేఖ ద్వారా తెలియజేస్తాం…
మధుసూదనాచారి కి ఇవ్వకుంటె మాకు ఇవ్వమని అడిగాం..
చారీ గారు మా కార్యకర్తల పై కేసులు పెడితే వారు మమ్మల్ని పోటి చేయాలని కోరారు.ఈస్ట్ , పరకాల ,భూపాలపల్లి లో మేమే పోటీ చేస్తాం..మీకు ఏమన్న అభ్యంతరమా.
మేము ఏక్కడి కి పోయినా…మమ్మల్ని ఇతర పార్టీలు తీసుకుంటాయి.24 గంటల లోపు వాల్ల నిర్ణయం ప్రకటించకపోతె మా నిర్ణయం ప్రకటిస్తాం.ఏంపీ గా బాల్కా సుమన్ ,నరెంధర్ రెడ్డి కి ఎందుకు టిక్కెట్ ఇచ్చారు..
నాకు టికెట్ రాకపోవడానికి కేటీఆరే కారణం. కెటిఆర్ సొంత టీమ్‌ను కేటీఆర్ సిద్దం చేసుకుంటున్నారు. అందుకు నాలాంటి వారిని పక్కన పెట్టారన్నారు. తమ నియోజకవర్గాల్లో సమస్యలు సృష్టించింది ఆయనే.