ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ కు చెందిన ఎకనామిక్ టైమ్స్ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును ఈ ఏడాది ప్రతిష్టాత్మకమైన ఎకనామిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ విషయాన్ని టైమ్స్ గ్రూపు ఎండీ వినీత్ జైన్ ఈమెయిల్ ద్వారా ముఖ్యమంత్రికి తెలిపారు. ముంబైలో అక్టోబర్ 27న జరిగే అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొనాలని ముఖ్యమంత్రిని ఆహ్వానించారు.
ఈ అవార్డు తనకు వ్యక్తిగతంగా వచ్చినట్లు భావించడం లేదని, తెలంగాణ రాష్ట్రానికి లభించిన గుర్తింపుగా స్వీకరిస్తున్నాని కేసీఆర్ బదులిచ్చారు.
ఇలాంటి అవార్డు ముఖ్యమంత్రి కెసియార్ కు రావడం ఇదే మొదటిసారి. మామూలుగా ఇలాంటి అవార్డుల చంద్రబాబు నాయుడికి రెగ్యులర్ గా వస్తూంటాయి. ఇండియాలో ప్రతి మీడియా సంస్థకు ఇలాంటి బిజినెస్ లీడర్, రిఫార్మర్ అంటూ అవార్డు లిస్తూ ఢిల్లీలో భారీగా ఒక కార్యక్రమం పెట్టి పెద్ద పెద్ద సిఇవొలను పిలిపించి ఒక ప్రజెంటేషన్ ఇప్పిస్తూ ఉంటారు.
ఇంగ్లీష్ పేపర్ల వాళ్లు పడి పడి ఈ వార్తలు రాస్తారు. ఆల్ ఇండియా ఇమేజ్ వస్తుందని చంద్రబాబు ఇలాంటి ఫైవ్ స్టార్ పండగలకు రెగ్యులర్ వచ్చే వారు. కెసియార్ ఫెడరల్ ఫ్రంటు పేరుతో జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్నపుడు ఇలాంటి ఆల్ ఇండియా అవార్డు రావడం ఆ పార్టీ కి గర్వకారణం.
అదొక పెద్ద పైవ్ స్టార్ పండగల్లాగా ఉంటుంది. ఇదొక మాయా ప్రపంచం. చంద్రబాబు నాయుడు ఇందులో పడి చాలా అవార్డులు తెచ్చకునేవారు. అవార్డుల తర్వాత ఈ పత్రికలు స్పెషల్ ఇష్యూ తెస్తాయి. గవర్నమెంటు గురించి, పథకాల గురించి తెగరాస్తాయి. (ఫ్రీగా కాదులే) 2004 ముందు చంద్రబాబుకు వచ్చిన ఇలాంటి అవార్డులకు లెక్కేలేదు. అదీ సంగతి.