ప్రగతి నివేదన సభ తెలంగాణలో కొత్త చర్చను లేవనెత్తింది. సభకు జనాలను తరలించేందుకు అన్ని బలాలు ఉపయోగించింది టిఆర్ఎస్ పార్టీ. డబ్బుల వరద పారించారు. మద్యం ఏరులై పారింది. ఎక్కడ చూసినా తాగుడే తాగుడు. బస్సులల్ల తాగుడు, బండ్లల్ల తాగుడు, రోడ్ల మీద తాగుడు, రోడ్డు పక్కన తాగుడు. ఆడోళ్లు తాగుడు, మొగోళ్లు తాగుడు. బాటిళ్ల చప్పుళ్లతో ప్రగతి సభకు తరలివచ్చారు టిఆర్ఎస్ నేతలు.
అయితే టిఆర్ఎస్ నేతలు ప్రగతి సభను కాస్తా తాగుడు నివేదన సభగా మార్చారన్న విమర్శలున్నాయి. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రగతి నివేదన సభ తాగుడు దేశమంతా ఎరుక అయింది. జాతీయ మీడియాలో టిఆర్ఎస్ నేతల తాగుడు మీద మాంచి కవరేజ్ దక్కింది.
దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ వెలిగిపోతుందని పాలక పెద్దలు బల్లగుద్ది చెబుతున్న ఈ తరుణంలో తెలంగాణ తాగుడులోనూ నెంబర్ వన్ అన్నట్లుగా ప్రగతి సభ మారిపోయిందని జనాలు విమర్శిస్తున్నారు. దీంతో జాతీయ మీడియా ప్రగతి సభ కంటే ప్రగతి సభకు వచ్చిన గులాబీ శ్రేణుల తాగుడుపై మంచిగానే కవరేజీ ఇచ్చింది. గులాబీ నేతల తాగుడు వీడియోలను కలెక్ట్ చేసి జాతీయ చానెళ్లు ఎలా కవర్ చేశాయో పైన వీడియో ఉంది చూడండి.
ఈ వీడియో ఇప్పుడు తెగ షేర్ అవుతున్నది. సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్నది. ఒకవైపు సిఎం కేసిఆర్ ప్రసంగంలో పసలేదని విమర్శలు వినిపస్తుండగా మరోవైపు జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రగతి సభలో తాగుడు ప్రసారాలు కావడం చర్చనీయాంశమైంది.